గ్రాండ్‌గా పెళ్లి చేసుకుని.. శోభనం రాత్రి కోసం ఆతృతగా ఎదురుచూసిన ఓ నవవరుడు ఊహించని సంఘటనతో.. ఆసుపత్రి పాలయ్యాడు. ఈ అనూహ్య ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ దీని వెనుక అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా..
వివరాల్లోకి వెళ్తే.. నాగౌర్ జిల్లా దివానా ప్రాంతంలోని మక్రానాకు చెందిన ఇక్రమ్ సిసోడియా అనే వ్యక్తికి జూన్ 9న గ్రాండ్‌గా పెళ్లైంది. ఇక అతడు పెళ్ళైన మరుసటి రోజు జూన్ 10న ఫస్ట్ నైట్ కోసం ఆతృతగా ఎదురు చూశాడు. శోభనం కోసం ప్రత్యేకంగా అలంకరించిన గదిలో.. మధ్యాహ్న సమయంలో ఓ చిన్న కునుకు తీశాడు. అంతే! ఇంతలోనే అనూహ్యంగా అతడి కేకులు వినిపించాయి. కుటుంబసభ్యులందరూ వెంటనే అక్కడికి చేరుకోగా… వరుడు రక్తపు మడుగులో కనిపించాడు. ఆ తర్వాత అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
వరుడు మెడకు, చేతికి బలమైన గాయాలు అయ్యాయి. ఆ సీలింగ్ ఫ్యాన్ బ్లేడు వరుడి మెడను బాగా లోతుగా కోసేయడంతో.. గాయమైన చోట డాక్టర్లు 26 కుట్లు వేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటు శోభనం గదిలోని సీలింగ్ ఫ్యాన్ పాతది కావడంతోనే అది ఊడిపోయి.. వరుడు పడుకున్న మంచంపై పడిందని ఇక్రమ్ త్రండి చెప్పారు.