Viral Video: మీరు మాత్రం ఎప్పుడూ ఇలా చేయకండి.. ఇంటి వద్ద మీ వాళ్లు ఎదురుచూస్తున్నారు

|

Sep 10, 2022 | 3:35 PM

రైలు పట్టాలు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. అందుకే ప్రతి అడుగు ముందూ వెనకా చూసుకుని వేయాలి. అందుకే రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటకూడదని అధికారులు..

Viral Video: మీరు మాత్రం ఎప్పుడూ ఇలా చేయకండి.. ఇంటి వద్ద మీ వాళ్లు ఎదురుచూస్తున్నారు
Train Video Viral
Follow us on

రైలు పట్టాలు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. అందుకే ప్రతి అడుగు ముందూ వెనకా చూసుకుని వేయాలి. అందుకే రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటకూడదని అధికారులు నియమాలు విధించారు. పై వంతెన ద్వారా మాత్రమే అవతలి వైపుకు వెళ్లాలని రూల్స్ ఉన్నాయి. అయితే కొంత మంది మాత్రం ఆ రూల్స్ ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. రైలు పట్టాలు దాటుతూ ప్రమాదాన్ని కొని తెంచుకుంటున్నారు. ఇలాంటి ఘటనల్లో కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు మనం చూసే ఉన్నాం. కొంత మంది మాత్రం అక్కడి సిబ్బంది చాకచక్యంతో సురక్షితంగా బయటపడటం వంటి వీడియోలు కూడా మనం చూశాం. సోషల్ మీడియాలో రైలు పట్టాలు, ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతానికి కూడా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ రైల్వే కార్మికుడు తృటిలో ప్రమాదం నుంచి మహిళను సేఫ్ చేశాడు. ఈ ఘటన మొత్తం స్టేషన్‌లోని సీసీ టీవీలో రికార్డయింది.

ఉత్తరప్రదేశ్‌లోని షికోహాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ మహిళ మరో ప్లాట్‌ఫారమ్‌పైకి రావడానికి రైల్వే ట్రాక్‌ను దాటుతోంది. ఆ సమయంలో ట్రాక్ పై రైలు వేగంగా వస్తోంది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఏ మాత్రం ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ మహిళను పైకి లాగాడు. కొంచెం ఆలస్యం చేస్తే ఆ మహిళ ప్రాణాలు పోయేవని వీడియో చూస్తే మనకు అర్థమవుతోంది. కానీ ఆ తర్వాత కూడా ఆమె చేసిన పని నెటిజన్లకు షాక్ కు గురి చేస్తోంది. ఈ భయానక వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘ఈ మహిళ షికోహాబాద్ రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతోంది. రైలు వచ్చే సమయంలో చీఫ్ స్టాఫ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ రాంస్వరూప్ మీనా ప్లాట్‌ఫాంపైకి ఈడ్చుకెళ్లి అతడి ప్రాణాలను కాపాడారు’. అని క్యాప్షన్ ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..