Viral Video: కొండచిలువ ఎంత పని చేసింది.. వీడియో చూస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం..

|

Aug 14, 2024 | 3:04 PM

సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులోనూ జంతువులకు సంబంధించిన వీడియోలు మరింత జోరుగా వైరల్ అవుతాయి. ముఖ్యంగా ఈ వీడియోల్లో ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటాయి. పాము విషపూరితమైన జంతువు. పాములను చూశారంటే ఆమడ దూరం పారిపోవాల్సిందే. కాదు లేదు అంటూ గేమ్స్ ఆడితే.. ఒకటే కాటు వేస్తుంది. అందులోనూ కొండచిలువను చూస్తే అక్కడే కొంత మందికి..

Viral Video: కొండచిలువ ఎంత పని చేసింది.. వీడియో చూస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం..
Viral Video
Follow us on

సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులోనూ జంతువులకు సంబంధించిన వీడియోలు మరింత జోరుగా వైరల్ అవుతాయి. ముఖ్యంగా ఈ వీడియోల్లో ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటాయి. పాము విషపూరితమైన జంతువు. పాములను చూశారంటే ఆమడ దూరం పారిపోవాల్సిందే. కాదు లేదు అంటూ గేమ్స్ ఆడితే.. ఒకటే కాటు వేస్తుంది. అందులోనూ కొండచిలువను చూస్తే అక్కడే కొంత మందికి గుండె ఆగిపోతుంది. మనుషుల్ని సైతం మింగేస్తాయి కొండచిలువలు. సోషల్ మీడియా మాధ్యమం వేదికగా.. ఇప్పుడు కొండచిలువలు అలాంటి భారీ ఆకారాల్ని కూడా చూస్తూనే ఉంటాం. తాజాగా కొండచిలువకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో.. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కొండచిలువ వచ్చేసింది. ఒక షెడ్డులోకి ప్రవేశించింది. దాని భారీ ఆకారానికి ఆ షెడ్డు కూడా మొత్తం కూలిపోయింది. అంత భారీ కొండచిలువను చూస్తే నిజంగానే గుండె ఆగిపోతుంది. అప్పటికే అది దేనినో మింగేసినట్లు ఉంది. ఎటూ కదల్లేక తిప్పలు పడుతుంది. అక్కడే ఉన్న షెడ్డు నుంచి లోపలికి ప్రవేశించింది. కంచెను కూల్చేసి మరీ లోపలికి ఎంట్రీ ఇచ్చింది. దాని కడుపు అంతా ఎంతో ఉబ్బుగా ఉంది.

కొండచిలువలను సాధారణంగా ఫోన్లు, టీవీలు, వీడియోల్లో చూస్తేనే గుండె ఆగిపోతుంది. అలాంటి అక్కడే ఉన్న కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. బాబోయ్.. ఎంత పెద్దగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూశారంటే మీరు కూడా నిజంగానే షాక్ అవుతారు.