AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మనతో మామూలుగా ఉండదు.. వర్షంలో ఇతడు చేసిన పని చూస్తే నవ్వి నవ్వి పడిపోతారు..

జోరుగా వర్షం పడుతుంది.. చుట్టూ రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. జనాలు ఇళ్లలోంచి బయటకు రావడానికే జంకుతుంటే ఈ ఉద్యోగి చేసిన పని చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. అంత పెద్ద వర్షంలో ట్యాంకర్‌తో రోడ్డు పక్కన ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్నాడు. పూణెలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: మనతో మామూలుగా ఉండదు.. వర్షంలో ఇతడు చేసిన పని చూస్తే నవ్వి నవ్వి పడిపోతారు..
Municipal Worker Waters Plants In Heavy Rain
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jul 04, 2026 | 1:01 PM

Share

సోషల్ మీడియా యుగంలో నిత్యం ఎన్నో విచిత్రమైన వీడియోలు నెటిజన్ల కంటపడుతుంటాయి. కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం నెటిజన్లను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా పెద్ద చర్చకు దారితీసింది. ఆకాశానికి చిల్లు పడిందా అనేలా కుండపోత వర్షం కురుస్తోంది.. చుట్టూ రోడ్లన్నీ జలమయమై ఉన్నాయి. అలాంటి సమయంలో ఓ మున్సిపల్ ఉద్యోగి ఏమాత్రం తడబడకుండా వాటర్ ట్యాంకర్‌తో రోడ్డు పక్కన ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పుణె పౌడ్ రోడ్డులో విచిత్ర ఘటన

ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఈ వీడియో మహారాష్ట్రలోని పుణె నగరంలో గల పౌడ్ రోడ్ ప్రాంతానికి చెందినదిగా తెలుస్తోంది. అక్కడ గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీడియోలో చూసినట్లయితే.. వర్షం జోరుగా పడుతున్నప్పటికీ, ఆ మున్సిపల్ కార్మికుడు ఏమాత్రం లెక్కచేయకుండా ట్యాంకర్ పైపు పట్టుకుని డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు, చెట్లకు నీళ్లు పోస్తూ తన విధుల్లో మునిగిపోయాడు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఈ విచిత్రమైన దృశ్యాన్ని చూసి నోరెళ్లబెట్టారు. అందులో ఒకరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.

రెండు వర్గాలుగా విడిపోయిన నెటిజన్లు

ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు. ‘‘ఆకాశం నుంచి దేవుడే కుండపోతగా నీళ్లు పోస్తుంటే, మళ్లీ ట్యాంకర్‌తో నీళ్లు పోయాల్సిన అవసరం ఏముంది? ఇది మున్సిపల్ నిధుల దుర్వినియోగం కాదా?’’ అంటూ కొందరు మున్సిపల్ వ్యవస్థ పనితీరుపై తీవ్రంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ పైసలు ఇలాగే తగలేస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ ఉద్యోగి వైపు నిలబడుతున్నారు. ‘‘అతను కేవలం రోజువారీ కూలీ లేదా కింది స్థాయి ఉద్యోగి మాత్రమే. పైన ఉన్న అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే అతను వర్షంలోనూ విధిని నిర్వర్తించాడు. అతని కర్తవ్యనిష్ఠను, నిజాయితీని అభినందించాలి కానీ విమర్శించకూడదు’’ అని మద్దతు తెలుపుతున్నారు.

ఇంకా రాని అధికారిక వివరణ

ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నప్పటికీ.. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఈ వీడియోను ఖచ్చితంగా ఎప్పుడు తీశారు? ఎవరు తీశారు? భారీ వర్షం పడుతున్నా సరే చెట్లకు నీళ్లు ఎందుకు పోయాల్సి వచ్చింది? ట్యాంకర్‌లో ఉన్నవి కేవలం నీళ్లా లేక మొక్కల పెరుగుదలకు వాడే ద్రవ రూప ఎరువులా? అనే విషయాలపై పుణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నుండి ఇంకా ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. క్లారిటీ వచ్చే వరకు ఈ వీడియోపై మీమ్స్, చర్చలు మాత్రం ఆగవు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వీడియో చూడండి..

Follow Us