Proud Moment: ఇంతకంటే అద్భుత క్షణాలేముంటాయి.. నెట్టింట్లో వైరలవుతోన్న తండ్రీ కూతుళ్ల సెల్యూట్‌ ఫొటోలు..

|

Nov 03, 2021 | 10:42 AM

'జీవితంలో ఎవరిని స్ఫూ్ర్తిగా తీసుకుంటారు' అని అడిగితే మనలో చాలామంది 'నాన్న' అని సమాధానమిస్తారు..

Proud Moment: ఇంతకంటే అద్భుత క్షణాలేముంటాయి.. నెట్టింట్లో వైరలవుతోన్న తండ్రీ కూతుళ్ల సెల్యూట్‌ ఫొటోలు..
Follow us on

‘జీవితంలో ఎవరిని స్ఫూ్ర్తిగా తీసుకుంటారు’ అని అడిగితే మనలో చాలామంది ‘నాన్న’ అని సమాధానమిస్తారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నాన్ననే చూస్తూ పెరిగాం. వారి చేయి పట్టుకునే నడక నేర్చుకున్నాం. అందుకే చాలామంది తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనుకుంటారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పోలీస్‌ అధికారి ఆపేక్షా నింబాడియా కూడా తండ్రినే స్ఫూర్తిగా తీసుకుంది. ఉన్నత చదువులు అభ్యసించి పోలీస్‌ అధికారిగా మారింది. అయితే ఓ ప్రత్యేక సంద్భంలో ఈ తండ్రీ కూతులిద్దరూ తారసపడ్డారు. తండ్రి తన ఉన్నతాధికారి కావడంతో మొదట కూతురు సెల్యూట్‌ చేసింది. అయితే తన గారాల పట్టిని చూసి గర్వంతో పొంగిపోయిన తండ్రి మరుక్షణమే ఆమెకు ప్రతి సెల్యూట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ తండ్రీబిడ్డల సెల్యూట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

తండ్రి అడుగుజాడల్లోనే..
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఏపీఎస్‌ నింబాడియా ప్రస్తుతం ఐటీబీపీ (ఇండో టిబెటన్‌ బోర్డర్‌ ఆఫీస్‌)లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్(డీఐజీ)గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనే కాదు వీరి పూర్వీకుల్లో చాలామంది పోలీసు అధికారులుగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి నుంచి స్ఫూర్తి పొందిన ఆపేక్షా కూడా ఖాకీ దుస్తులు ధరించాలన్న లక్ష్యంతోనే చదివింది. ఇందులో భాగంగానే యూపీలోని మొరాదాబాద్‌లోని డాక్టర్ బీ ఆర్‌ అంబేడ్కర్‌ పోలీస్‌ అకాడమీ నుంచి పట్టాపొందింది. త్వరలోనే ఆమె ఉత్తర ప్రదేశ్‌ పోలీస్‌ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించనుంది. ఈ క్రమంలోనే సోమవారం గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆపేక్ష తండ్రి నింబాడియా కూడా హాజరయ్యారు. పాసింగ్‌ అవుట్ పరేడ్‌ సందర్భంగా ఒకరికొకరు సెల్యూట్‌ చేసుకుని సంతోషంతో మురిసిపోయారు. తండ్రీ కూతుళ్లు కలిసిన ఈ అద్భుత క్షణాలను ఐటీబీపీ సోషల్‌ మీడియాలో పంచుకోగా నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘ హృదయం సంతోషంతో ఉప్పొంగే సందర్భమిది. జైహింద్‌’ అంటూ తండ్రీకూతుళ్లను ప్రశంసిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

Also read:

Whatsapp New Feature: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో.. (వీడియో)

News Watch: ఈటల విక్టరీ కి 9 రీజన్స్.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు న్యూస్ వాచ్(వీడియో)

Puneeth Raj kumar: అప్పు చివరి క్షణాలు.. భార్య ఒడిలో..! సీసీ ఫుటేజ్‌లో హాస్పిటల్‌కి వెళ్తూ.. (వీడియో)