Telangana: ఏంటి భయ్యా ఇలా ఉన్నారు.. పూజారిని బైక్‌పై ఎత్తుకెళ్లిపోయారు..

వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో.. ఊరావాడా గణపతి పాటలు మారుమోగుతున్నాయి. పలు చోట్ల వినాయకుడు పూజలు చాలించి.. నిమజ్జనానికి తరలివెళ్తున్నాడు. ఇంకొన్ని చోట్ల భక్తులు అన్నదానాల తంతు కొనసాగుతుంది. ఇంతలో ఓ ఆసక్తికర దృశ్యం నెట్టింట వైరల్ అవుతుంది .. ..

Telangana: ఏంటి భయ్యా ఇలా ఉన్నారు..  పూజారిని బైక్‌పై ఎత్తుకెళ్లిపోయారు..
Priest Shortage

Updated on: Aug 30, 2025 | 8:04 AM

తెలుగు రాష్ట్రాలన్నింటిలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు ఏకదంతుడికి ప్రతి రోజు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ, ఊరావాడా గణపతి పాటలతో సందడి చేస్తున్నారు. కొందరు మండపాల్లో అన్నదానాలు నిర్వహిస్తుండగా, మరికొన్ని చోట్ల నిమజ్జన శోభాయాత్రలు కొనసాగుతున్నాయి.

కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలో నవ్వులు పూయించే వింత సంఘటన వెలుగుచూసింది. పూజారుల కొరత కారణంగా వినాయక చవితి రోజు రాత్రి ఇద్దరు మండప నిర్వాహకులు ఒకే పూజారి కోసం పోటాపోటీకి దిగారు. “ముందుగా మా మండపంలో పూజ చేయాలి” అని ఒక వర్గం పట్టుబడగా.. “మాకు ప్రాధాన్యం ఇవ్వాలి” అంటూ మరో వర్గం వాదించింది. మాటల యుద్ధం చివరికి వినోదాత్మక మలుపు తిప్పింది. చివరికి ఒక వర్గం ఆ పూజారిని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు.

ఈ దృశ్యం చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యి.. వెంటనే నవ్వులు ఆపుకోలేకపోయారు. “గణేష్ పూజలు మొదలయ్యేలోపే పూజారి కోసం ఇలా బైక్ రేసా?” అంటూ ఆశ్చర్యపోయారు. అయితే పండితులు ఇలా వ్యవహరించడం తప్పు అని.. మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

వీడియో దిగువన చూడండి…