బాబా వంగా అంచనా నిజమా..! భూమికి ఆవల జీవం ఉందా? ఎలియన్స్ అంతరిక్షం నుంచి సంకేతాలు పంపుతున్నాయా..!

విశ్వం అనేక రహస్యాలతో నిండి ఉంది. ఎప్పటి నుంచో ఎలియన్స్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భూమి తాకిన శక్తివంతమైన ఒక సంకేతం గ్రహాంతరవాసులదని భావిస్తున్నారు. ఇది పాలపుంత గెలాక్సీ వెలుపల నుంచి వచ్చిందని గామా కిరణాలు పదే పదే విస్ఫోటనం చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

బాబా వంగా అంచనా నిజమా..! భూమికి ఆవల జీవం ఉందా? ఎలియన్స్ అంతరిక్షం నుంచి సంకేతాలు పంపుతున్నాయా..!
Powerful Alien Signal Hits Earth

Updated on: Sep 11, 2025 | 10:17 AM

భూమి ఆవల జీవం ఉందా.. ఈ విషయం ఎన్నో సంవత్సరాలుగా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ విషయం తెలుసుకునేందుకు ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు విశ్వంలోకి రకరకాల సిగ్నల్స్ పంపి రకరకాల ప్రయోగాలను చేస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది లో జరిగే సంఘటనలలో బాబా వంగా వేసిన అంచనాలలో ఒకటి భూమి మీద ఎలియన్స్ అడుగు. విషయం ఎన్నో ఏండ్లుగా మానవులకు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే తాజాగా మన గెలాక్సీ వెలుపల గామా కిరణ విస్ఫోటనాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది శక్తివంతమైనది మాత్రమే కాదు.. అసాధారణంగా.. దీర్ఘకాలం కూడా ఉంటుంది.

జూలైలో మొదట గమనించిన అధిక రేడియేషన్ ప్రత్యేకమైన పేలుడును అధ్యయనం చేయడానికి భూమిపై, అంతరిక్షంలోని టెలిస్కోపులు, హబుల్‌తో సహా కలిసి పనిచేశాయి. ఖగోళ శాస్త్రవేత్తలు మంగళవారం వెల్లడించిన నివేదించిన ప్రకారం.. ఇప్పుడు వచ్చిన సిగ్నల్స్ ఇంతకు ముందు చూసిన వాటికి భిన్నంగా ఉంది.

ఒక రోజు వ్యవధిలో పదే పదే గామా కిరణాల పేలుళ్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది చాలా అసాధారణం. ఎందుకంటే ఈ రకమైన పేలుళ్లు సాధారణంగా నిమిషాలు లేదా మిల్లీసెకన్లు మాత్రమే ఉంటాయి. కొన్ని గంటల కంటే ఎక్కువ సేపు పేలుళ్లు జరుగవు. ఇలా గంటల పాటు జరగడం అరుదని వెల్లడించారు. ఎందుకంటే చనిపోతున్న నక్షత్రాలు కూలిపోతాయి లేదా బ్లాక్ హోల్స్ ద్వారా నలిగిపోతాయి.

ఇవి కూడా చదవండి

ఇంత సుదీర్ఘమైన , పునరావృతమయ్యే గామా కిరణ విస్ఫోటనం అస్పష్టంగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. కనీసం ప్రస్తుతానికి ఇది ఒక కాస్మిక్ వూడునిట్. దాని ఖచ్చితమైన స్థానాన్ని నిర్ధారించడానికి మరిన్ని పరిశీలనలు అవసరమని అన్నారు. తమ పరిశోధనల ఫలితాలను యూరోపియన్ నేతృత్వంలోని బృందం ఆగస్టులో ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్‌లో ప్రకటించింది.

 

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us