Viral Video: ప్రజాస్వామ్యమంటే ఇదే.. నడవలేని స్థితిలో వచ్చి అనుకున్నది చేశాడు..

ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు(Elections) జరుగుతోంది...

Viral Video: ప్రజాస్వామ్యమంటే ఇదే.. నడవలేని స్థితిలో వచ్చి అనుకున్నది చేశాడు..
Viral Video

Updated on: Feb 15, 2022 | 6:45 AM

ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు(Elections) జరుగుతోంది. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు ఓట్లు(Vote) వేస్తున్నారు. అయితే ఓటింగ్ సందర్భంగా పలు వీడియోలు సోషల్ మీడియాలో(Social media) వైరల్‌ అవుతున్నాయి. తాజాగా హృదయాన్ని హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో చూసిన తర్వాత మీరు కూడా చెబుతారు ప్రజాస్వామ్యాంటే ఇదే అని. ఈ వీడియో చూసిన యూజర్లు ఇలాంటి వీడియో నిజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ వృద్ధుడిని ఓ పోలీసు ఎత్తుకుని ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా ఇదే ప్రజాస్వామ్యానికి ప్రత్యేకత అని అంటున్నారు. ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు తమ ఓటును వినియోగించుకుంటున్నారని చెబుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోను ఉత్తరాఖండ్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో పాటు క్యాప్షన్ రాశారు. “ప్రజాస్వామ్య పండుగలో పెద్దలు కూడా తమకు నచ్చిన వారిని ఎన్నుకునేందుకు ముందుకొచ్చారు. వారిని ఉత్తరాఖండ్ పోలీసు సిబ్బంది తీసుకెళ్లారని” అని రాశారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోపై పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Read Also.. Viral Video: అత్యుత్సాహం కొంప ముంచింది.. క్షణాల్లో తుక్కుతుక్కయిన బైక్‌, షాకింగ్‌ వీడియో..