Viral vide: వర్షాలు..జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.. ఎక్కడ చూస్తున్న వరదలు పారుతున్నాయి. వర్షాల ధాటికి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో మంది వరదల్లో చిక్కుకొని ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఎంతోమంది తమ సొంత ఊర్లను కూడా వదిలి వెళ్లిపోతున్నారు. ఇక వరదల్లో కార్లు, బస్సులు, మనుషులు చిక్కుకున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియో కూడా వరదల్లో చిక్కుకున్న కారుకు సంబందించినదే.. వరదల్లో చిక్కుకున్న వారిలో చాలా మందిని పోలీసులు, రెస్క్యూ టీమ్ కాపాడారు. ఇప్పుడు ఈ వీయస్యోలో కూడా ఓ కారు వరదలో చిక్కుకుంది. ఆ కారులో ఓ మహిళ కూడా ఉంది. ఆమెను రక్షించడానికి పోలీసులు ఎన్ని అవస్థలు పడ్డారో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.
ఈ వీడియోలో ఓ రెడ్ కలర్ కార్ సిటీలో మునిగిపోయింది. అయితే ఆ కారులో డ్రైవింగ్ సీట్ లో ఓ మహిళ చిక్కుకుంది. ఆమెను కాపాడటానికి పోలీసులు చాలా అవస్థలు పడ్డారు. కారు దాదాపు నీటిలో మునిగిపోయింది. ఆమెను కాపాడాలంటే కారు అద్దాలు పగలకొట్టాలి. కానీ అద్దం పగలకొడితే నీరు లోపలికి వెళ్ళిపోతుంది. అయితే ఎంతో చాకచక్యంగా ఆ అద్దాన్ని పగలకొట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను ఆ విండోలో నుంచి బయటకు లాగి కాపాడారు. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేసినా ఆమె చనిపోయేది. అలా కాదని వదిలేస్తే ఊపిరి ఆడకా ఆమె చనిపోయివుండేది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
On July 28, 2022, the Apache Junction Police Department responded to 24 different calls for service related to flooding.
The incident you will see in this AJPD officer body camera is from a rescue of a motorist stranded in Weekes Wash.
(1 of 5) pic.twitter.com/WXrrJMO6dp
— AJ Police Department (@AJPoliceDept) July 30, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి