ప్రజలను రక్షించడానికి, సహాయం చేయడానికి పోలీసు పరిపాలన విభాగం పనిచేస్తుంది. అయితే, ఒక్కోసారి పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తిస్తారని, సామాన్య ప్రజల పట్ల అనుచితంగా వ్యవహరిస్తారని, సామాన్యుల పట్ల కఠినంగా ఉంటారని ఆరోపిస్తుంటారు. కానీ, ఖాకీలంటే కఠినాత్ములు కాదని, వారిలోనూ గొప్ప హృదయం కలిగినవారే ఎక్కువగా ఉంటారని ఇప్పటికే అనేక వీడియోలు నిర్దారించాయి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మానవతా దృక్పథం ఉన్నవారే చాలా ఎక్కువ మంది ఉంటారు. పోలీసుల ఔదార్యం, ఎదుటివారికి వారికి సాయం చేసే గుణం ఎక్కువగానే ఉంటుంది. అలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వార్తలు, వీడియోలు గతంలో చాలానే చూశాం. అయితే, తాజాగా పోలీసుల మంచి ప్రవర్తన, సహాయానికి సంబంధించిన అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. ఇది చూస్తే మీరు కూడా ఈ పోలీసులను ప్రశంసించకుండా ఉండలేరు.
వైరల్‌గా మారిన వీడియోలో..నిరుపేద కుటుంబానికి చెందిన ఓ బాలుడు చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. పై నుంచి ఎండ వేడిమితో రోడ్డుపై అతడి కాళ్లు మాడిపోతున్నాయి. తీవ్ర దాహంతో అల్లాడి పోతున్న ఆ బాలుడిని ఒక పోలీసు అధికారి చూశాడు. ఆ బాలుడిని చూసిన ఆ ఖాకీ హృదయం కరిగిపోయింది. వెంటనే సదరు ఆఫీస్ ఆ బాలుడిని ఆపి, మొదట అతనికి వాటర్ బాటిల్ ఇచ్చి నీళ్లు తాగించాడు. పోలీసు అధికారి ప్రేమగా బాలుడి భుజాలపై చేయి మాట్లాడుతూ ఓదార్చాడు. ఇదంతా వీడియోలో కనిపించింది. ఆ తరువాత అతడికి కొత్త చెప్పులు కొనిచ్చాడు. పోలీసు అధికారి స్వయంగా తన చేతులతో ఆ అబ్బాయికి చెప్పులు తొడిగించాడు. కొత్త బట్టలు కూడా ఇచ్చారు. చెప్పులు, కొత్త బట్టలు ఇచ్చిన పోలీస్ ఆఫీసర్‌ని చూసిన ఆ బాలుడు.. సంతోషపడిపోయాడు. పోలీసు పాదాలను తాకడానికి ప్రయత్నించగా, పోలీసు అతని పాదాలను తాకడానికి నిరాకరించాడు. ఈ వీడియో చూసిన జనాలు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కుమ్మరించారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో పాటు ఈ వీడియోకు లక్షకు పైగా లైక్స్ కూడా వచ్చాయి. ఈ వీడియోపై జనాలు కూడా ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..