సొమాలియా రాజధాని మొహదీషులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ విమానం రన్‌వేపై వెళ్తూ.. అదుపుతప్పి ఫెన్సింగ్‌ను ఢీకొట్టి ముక్కలవ్వడం కలకలం రేపింది. అయితే ఆ విమానంలో ఉన్న సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే జులై 11 న హల్లా ఎయిర్‌లైన్‌కు చెందిన ఈ 120 అనే విమానం క్రాష్ ల్యాండ్ చేసేందుకు యత్నంచింది. ఇందుకోసం మొహదీషులోని అడెన్ అడ్డే అనే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రన్‌వే పై దిగింది. కానీ దిగిన కొన్ని క్షణాల్లోనే ఆ విమానం అదుపుతప్పింది. చివరికి రన్‌వే పక్కన ఉన్న కంచెను బలంగా ఢీకొట్టింది.
ఈ క్రమంలో ఆ విమానం ముక్కలైంది. రెక్కలు పూర్తిగా విరిగిపోయాయి. టైర్లు ఊడిపోయాయి. అయినా కూడా అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఇద్దరికి స్వల్పంగా గాయాలైనట్లు సొమాలి సివిల్ ఏవియేషన్ అధికారులు చెప్పారు. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో ఆ విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 34 మంది ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఆ విమానం రన్‌వే నుంచి ఎందుకు అదుపు తప్పింది అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం అధికారులు దీనిపై విచారణ చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
Video of aircraft type E120, operated by HALLA AIRLINE, crash landing on Runway 05 at Aden Ade International Airport (AAIA) today, at 12:23pm local time.
All 34 crew and passengers on board have survived according to the Somali Civil Aviation Authority . One person suffered… pic.twitter.com/tMrX7mcxsY
— Harun Maruf (@HarunMaruf) July 11, 2023
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..