
బెంగళూరులోని ఓ కూరగాయల దుకాణం ముందు వేలాడదీసిన ఓ మహిళ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కళ్లు పెద్దవి చేసుకుని కోపంగా చూస్తున్న ఆమె ఫొటోను చూసిన వారంతా ఇదేం చూపురా బాబోయ్ అంటూ జడుసుకుంటున్నారు. ఈ ఫోటో ఎందుకు పెట్టారా..? అని గెస్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘ఎక్స్’లో నిహారిక అనే యూజర్ షేర్ చేసిన కాసేపటికే ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. షేర్ చేసిన రెండు రోజులకే ఈ ఫొటోకు వేలల్లో వ్యూస్ వచ్చాయి. బెంగళూరులోని కాత్రిగుప్పె వాటర్ ట్యాంక్ సమీపంలోని దుకాణం వద్ద ఈ ఫొటో ఏర్పాటు చేసినట్లు కొందరు చెబుతున్నారు.
దుకాణానికి చెడు దృష్టి తగలకుండా ఉండేందుకే ఈ ఫొటో ఏర్పాటు చేశారని అసలు విషయం తెలిసిన వారు చెప్పుకొచ్చారు. దీనిపై చాలా మంది యూజర్లు చిత్రమైన కామెంట్లు పోస్ట్ చేశారు. ఇక్కడ బేరాల్ లేవమ్మ అంటూ ఆమె వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఆమె చూపు ఉందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరొకరేమో ఈ ఫొటోను చూస్తే పిల్లలు పక్కాగా భపడతారని పేర్కొన్నారు. వామ్మో.. ఈ ఫోటో చూశాక నాకు నిద్ర పట్టడం లేదు.. అర్జెంటుగా డాక్టర్‌ను సంప్రదించాలని మరొకరు రాసుకొచ్చారు. అరె.. ఈమె అచ్చం మన తెలంగాణ శకుంతలలా ఉందని ఓ యూజర్ చమత్కరించగా.. జీతం పెంచాలని అడిగినప్పుడు మా బాస్ చూపు ఇలాగే ఉంటుందని ఇంకొకరు కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..