సోషల్ మీడియాలో వచ్చిన దగ్గర నుంచి ప్రపంచం నలమూలల ఏం జరిగినా.. ఇట్టే మన అరచేతిలో ప్రత్యక్షమవుతున్నాయి. ఒక్క ఇదే కాదు.. అలనాటి మన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను కూడా సోషల్ మీడియా అప్పుడప్పుడూ గుర్తు చేస్తుంటుంది. మనం ఆడుకున్న ఆటలు, స్కూల్‌కి డుమ్మా కొట్టి సినిమాలు వెళ్లిన రోజులు.. పరీక్షలో మార్కులు చూసి అమ్మ కొట్టిన బెల్ట్ దెబ్బలు.. ఇలా ఒకటేమిటి చిన్నతనం అంతా కూడా గోల్డెన్ డేస్ అని చెప్పాలి. తాజాగా అలాంటి ఓ స్వీట్ మెమరీ ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. 1963లో ఐదు లీటర్ల పెట్రోల్‌ను కేవలం రూ. 3.60కే విక్రయించిన ఓ బిల్లు తాజా నెట్టింట చక్కర్లు కొడుతోంది. అప్పుడేమో రూపాయిలలో పెట్రోల్ విక్రయిస్తే.. ఇప్పుడేమో లీటర్ పెట్రోల్ ఏకంగా రూ. 110 వరకు ఉంది. ఇప్పటి ధరతో పోల్చుతూ.. ఒకప్పుడు లీటర్ పెట్రోల్ రూపాయి కంటే తక్కువగా ఉండటం చూసి ఈ గోల్డెన్ డేస్ మళ్లీ రావు అంటూ నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ స్వీట్ మెమరీని మీరూ ఓ లుక్కేయండి.
Petrol 5 litres for Rs. 3.60 p !!!! 😨🤔
#1963 #YeKahanAaGayeHum pic.twitter.com/gEMTKG2xoR— Abid Zaidi (@AbidZaidi1) May 10, 2017
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి