Viral Video: రైలు ప్రయాణం ఎవరికైనా అందమైనదే.. అందరూ ట్రైన్ జర్నీని ఆస్వాదిస్తారు. దేశంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఇదే ఉత్తమ వాహనం రైలు. ప్రయాణం చేసే సమయంలో తింటూ, తాగుతూ, నిద్రపోతూ, లేచేటప్పుడు ఎక్కడికైనా హాయిగా వెళ్తుంటారు. విశేషమేమిటంటే రైలు ఛార్జీ కూడా అధికంగా ఉండవు. ప్రజలు సాధారణంగా రైలు లోపల కూర్చొని ప్రయాణం చేస్తారు. అయితే రైలు పైన కూర్చుని ప్రయాణం చేయమని ఎవరూ ప్రోత్సహించరు. ఎందుకంటే అలా ప్రయాణించడం ప్రాణాంతకం. కనుక రైల్వే సంస్థ ప్రయాణీకులకు ప్రయాణం చేసే విధానం గురించి తెలియజేస్తూ.. ఎల్లప్పుడూ హెచ్చరిక చేస్తుంది. హెచ్చరికను లెక్కచేయకుండా కొంతమంది వ్యక్తులు ప్రయాణిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
వైరల్ అవుతున్న వీడియోలో రైలు ప్రయాణంలో ఒకరు కారు ఇద్దరు కాదు.. వందలాది మంది ప్రయాణిస్తున్నారు. రైలు అందమైన ప్రకృతి మధ్య అడవుల గుండా వెళుతుంది. తరువాత ఎత్తైన వంతెన మీదుగా వెళుతుంది. అయితే చాలామంది ప్రయాణీకులు రైలు పైన నిలబడి హాయిగా ప్రయాణిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రైలు పైన ఎలా నిల్చున్నారో వీడియోలో చూడవచ్చు. రైలు సడన్ బ్రేక్ పడితే అలా ప్రయాణిస్తున్న ఆ వందలాది మంది పరిస్థితి ఏమవుతుందో ఎవరూ ఊహించడానికి కూడా సాహసించరు. డైరెక్ట్ గా బ్రిడ్జి కింద పడిపోతామేమో అన్న భయం ప్రయాణీకులకు లేదు. పార్కులో నిలబడినట్లే రైలు పైన నిలబడి ఉన్నారు. ఈ వీడియో రాజస్థాన్ లో చోటు చేసుకుంది. రైలు ఆరావళి కొండల గుండా వెళుతున్నప్పుడు చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ఈ షాకింగ్ వీడియో మహారాష్ట్ర_గాడ్‌కిల్లే పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఇప్పటి వరకూ 36 లక్షల మందిని వీక్షించారు. 20 లక్షల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. ఇది ప్రమాదకరమని కొందరు, మరి కొందరు ‘ఇంతమంది భయపడలేదా’ అని అంటున్నారు. అదే సమయంలో ‘ఇలా రైలు ఎక్కేందుకు మిమ్మల్ని అనుమతిస్తారా’ అని కొందరు యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘లైక్‌లు, ఫాలోవర్ల కోసం ఇలా ప్రాణాలను పణంగా పెట్టడం అస్సలు సరికాదు’ అని మరికొందరు అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..