Viral Video: అమ్మమ్మ తో వెళ్తానంటూ మారాం చేస్తున్న పెంగ్విన్‌.. అల్లరి చేస్తున్న వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

|

Dec 14, 2022 | 5:55 PM

పెంగ్విన్‌కి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీడియోలో పెంగ్విన్, అమ్మమ్మ సంభాషణ నెటిజన్లకు బాగా ఆకట్టుకుంటోంది.

Viral Video: అమ్మమ్మ తో వెళ్తానంటూ మారాం చేస్తున్న పెంగ్విన్‌.. అల్లరి చేస్తున్న వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Penguin
Follow us on

జంతువులకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు పెంగ్విన్‌కి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీడియోలో పెంగ్విన్, అమ్మమ్మ వెంటపడుతున్నట్టుగా కనిపిస్తుంది. గాబ్రియేల్ కార్నో అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోలో పెంగ్విన్ ఒక వృద్ధ మహిళ వెనుక నడుస్తూ వెళ్తోంది. అది గమనించిన ఆ వృద్ధురాలు వెను దిరిగి చూస్తుంది. నువ్వు నాతోపాటే వస్తావా..? వద్దు.. అంటూ పెంగ్విన్‌కి నచ్చచెబుతున్నట్టుగా ఏదో సంభాషిస్తుంది. వీడియోలో, పెంగ్విన్‌తో అమ్మమ్మ మాట్లాడుతున్న దృశ్యం మనం క్లీయర్‌ చూడవచ్చు. అమ్మమ్మ ఫ్రెంచ్ మాట్లాడుతుంది. పెంగ్విన్ అమ్మమ్మ చెప్పేది శ్రద్ధగా వింటోంది. ఈ వీడియోపై పలువురు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వారిలో ఒకరు ఆ వృద్ధురాలు చెప్పిన మాటలను ఫ్రెంచ్‌లో అనువదించారు. పెంగ్విన్ చాలా అందంగా ఉందని, రేపు ఈ ప్రాంతానికి వస్తానని అమ్మమ్మ చెప్పింది. షేర్ చేసిన తర్వాత, ఈ వీడియోను ఇప్పటివరకు 7 లక్షల మంది వీక్షకులు వీక్షించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో దాదాపు 4300 రీట్వీట్‌లను కూడా సంపాదించింది. ఇది టీవీ షో అయి ఉండాలి. ఇది ఒక వృద్ధురాలు, ఆమె పెంగ్విన్ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘ఓహా సో స్వీట్! అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు. ఇలాంటి దృశ్యాలు చాలా అరుదు అని మరికొందరు వీడియోపై వ్యాఖ్యానించారు. ఇలాంటి వీడియోలు చాలా సంతోషంగా ఉంటాయని మరికొందరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి