Watch: సరస్వతి దేవి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న నెమళ్లు..డ్యాన్స్‌ ప్రాక్టీస్‌కి వెళ్తున్నాయనుకుంటా బహుషా..! వీడియో వైరల్‌

|

Sep 08, 2024 | 11:29 AM

పిల్లల్ని స్కూల్లో వేసే ముందు చాలా మంది పెద్దలు సరస్వతీ మాతకు నమస్కరించి, అమ్మవారి సమక్షంలో అక్షరాభాస్యం చేయిస్తుంటారు. దీనివల్ల వారు మంచి విద్యావంతులు అవుతారని నమ్ముతారు. ఇక అలాంటి చదువుల తల్లికి ప్రదక్షణ చేస్తున్న నెమళ్ల వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ పెడుతున్నారు.

Watch: సరస్వతి దేవి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న నెమళ్లు..డ్యాన్స్‌ ప్రాక్టీస్‌కి వెళ్తున్నాయనుకుంటా బహుషా..! వీడియో వైరల్‌
Peacocks Pradakshine
Follow us on

సంధ్యా సమయం సాయంత్రం వేళల్లో అందమైన పక్షుల గుంపులు కంటికి ఇంపునిస్తాయి. గూటికి చేరుతున్న పక్షుల కిలకిలారావాలు శ్రవణానందాలను కలుగజేస్తాయి. నెమలి నాట్యం నయనానందాన్ని కలుగజేస్తుంది. అలా నెమలి నాట్యం చేయడం చూస్తే ప్రకృతిలో ఇంతకు మించిన అందమైన దృశ్యం ఉంటుందా అని అనిపించక మానదు. ఇలాంటి అద్భుతమైన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్‌ అవుతున్నాయి. అయితే, అందమైన నెమళ్లు అలరించే డ్యాన్స్‌ మాత్రమే కాదు.. భక్తి శ్రద్ధలతో భగవంతుడిని కూడా పూజిస్తాయని తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. అలాంటి వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పీకాక్ డ్యాన్స్ చూడటం అందరికీ ఆనందంగానే ఉంటుంది. నెమలి నాట్యానికి సరితూగేది ఏది లేదు..అందుకే నెమళ్లను నాట్య మయూరి అంటారు. వైరల్‌ వీడియోలో నాట్య మయూరాలుగా కీర్తింపబడుతున్న నెమళ్లు చదువుల తల్లి సరస్వతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వీడియో నెట్టింట సందడి చేస్తోంది. ఈ నెమళ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మూడు నెమళ్లు సరస్వతిదేవి విగ్రహానికి ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి భక్తి శ్రద్ధలతో తిరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

పిల్లల్ని స్కూల్లో వేసే ముందు చాలా మంది పెద్దలు సరస్వతీ మాతకు నమస్కరించి, అమ్మవారి సమక్షంలో అక్షరాభాస్యం చేయిస్తుంటారు. దీనివల్ల వారు మంచి విద్యావంతులు అవుతారని నమ్ముతారు. ఇక అలాంటి చదువుల తల్లికి ప్రదక్షణ చేస్తున్న నెమళ్ల వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ తెలియజేస్తున్నారు. డ్యాన్స్ ప్రాక్టీస్‌కి వెళ్లే ముందు ఈ నెమళ్లు ఇలా సరస్వతి దేవికి నమస్కరిస్తున్నాయని కూడా కొందరు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..