ఆకాశంలో అద్భుత దృశ్యం.. గాల్లో ఎగురుతున్న మయూరం.. గతంలో ఎన్నాడూ చూడని అందం..

|

Oct 01, 2022 | 10:01 PM

ఆకాశంలో మబ్బులు కనిపిస్తే నెమళ్లకు మరింత సంతోషం కలుగుతుందని కూడా చెబుతారు. ఎందుకంటే ఆ సమయంలోనే అవి తమ అందమైన పింఛాలను విప్పి నాట్యం చేస్తాయి..

ఆకాశంలో అద్భుత దృశ్యం.. గాల్లో ఎగురుతున్న మయూరం.. గతంలో ఎన్నాడూ చూడని అందం..
Peacock Flying
Follow us on

వైరల్ వీడియో: నెమలి మన జాతీయ పక్షి అని అందరికీ తెలిసిందే. నెమలి అందం వర్ణనాతీతం. భారత ఉపఖండంలోనే కాకుండా, ఇవి ఆగ్నేయాసియా, ఆఫ్రికా ఖండంలోని కాంగో బేసిన్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. అందం పరంగా ఇతర పక్షుల కంటే నెమలి ముందు వరుసలో ఉంటుంది. అందుకే నెమలిని పక్షుల రాజు అని కూడా అంటారు. ఆకాశంలో మబ్బులు కనిపిస్తే నెమళ్లకు మరింత సంతోషం కలుగుతుందని కూడా చెబుతారు. ఎందుకంటే ఆ సమయంలోనే అవి తమ అందమైన పింఛాలను విప్పి నాట్యం చేస్తాయి.. ఆ సమయంలో అందం మరోలా ఉంటుంది. భూమిపై ఎగిరే పక్షులలో నెమళ్లు ఒకటి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోనే అందుకు నిదర్శనం. దీనిలో నెమలి ఎగురుతున్న అందమైన దృశ్యం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఎగిరే నెమలిని చూసినప్పుడు అది నిజంగా నేలమీద ఉన్న పక్షియేనా లేక ఆకాశం నుండి దిగి తిరిగి అక్కడికే వెళుతోందా అనిపిస్తుంది. నెమలిని అలంకరించివున్న భారీ రెక్కలు నిజంగా అద్భుతమైనవి. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు చూస్తున్న ఈ వైరల్ వీడియోలో అడవిలో ఇరుకైన రహదారిపై రెండు నెమళ్ళు నిలబడి ఉన్నాయి. వా వాటిలో ఒకటి రోడ్డు వెంట హాయిగా నడుస్తుండగా, మరొకటి తన పెద్ద రెక్కలతో పైకి ఎగురుతున్నట్లు మీరు చూడవచ్చు. అటువంటి అద్భుతమైన దృశ్యాన్ని మనం చాలా అరుదుగా చూడగలుగుతాము. నెమళ్ళు ఎప్పుడూ అలా కనిపించవు. అందుకే ఈ వీడియో చూసే వారి మనస్సులో ఆనందం వెల్లివిరుస్తుందనడంలో సందేహం లేదు. ఈ అందమైన వీడియో చూస్తే మీరు ఆనందిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆకాశంలో నెమలికి సంబంధించిన ఈ అద్భుతమైన వీడియోని @CosmicGaiaX అనే ఐడి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘Majestic Flight’ అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. కేవలం 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకి ఇప్పటి వరకు 2.5 మిలియన్ల వీక్షణలు, 27.5k లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోకు పలు వ్యాఖ్యలు కూడా వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి