Maskless Man pushed off a Train: కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేసి.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది. అయితే.. ఈ కరోనా కాలంలో.. ముఖానికి మాస్క్, చేతులు శుభ్రపరుచుకునేందుకు శానిటైజర్, భౌతిక దూరం మన జీవనంలో భాగమయ్యాయి. వైరస్ నియంత్రణకు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అన్ని దేశాలు తమ ప్రజలకు సూచనలతోపాటు ఆంక్షలు కూడా విధించాయి. ఒకవేళ ఉల్లంఘిస్తే వారిపై జరిమానాలు కూడా విధిస్తున్నాయి. అయినా కొందరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యం వల్లనే మహమ్మారి తీవ్రత పెరిగిందని అధ్యయనాలు చెపుతున్నా మాస్క్ ధరించడం లేదు. అలా మాస్క్ ధరించని వారిపై జనం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.
తాజాగా స్పెయిన్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి రాగా.. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మాస్కు లేకుండా ట్రైన్ ఎక్కిన ఓ యువకుడిపై.. జనం ఆగ్రహం వ్యక్తంచేసి బయటకు నెట్టేశారు. వివరాలు.. స్పెయిన్‌లోని లోకల్ మెట్రో ట్రైన్‌లోని ఓ వ్యక్తి మాస్క్ ధరించకుండా ఎక్కాడు. దీంతో ప్రయాణికులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్ ఎందుకు ధరించలేదంటూ.. ఆ వ్యక్తిని రైలు నుంచి దిగిపోవాలని చెప్పారు. అయినా.. ఆ వ్యక్తి వినలదు. దీంతో ప్రయాణికుల్లోని ఇద్దరు మహిళలు మరింత ముందుకొచ్చి.. దిగాలంటూ ఆ వ్యక్తిని బలవంతంగా డోర్ వద్దకు తీసుకువెళ్లారు. అయితే అతను దిగనంటూ మొండికేసినా.. చివరకు ఆ ఇద్దరు మహిళలు అతడిని బలవంతంగా ట్రైన్ డోర్ నుంచి ఫ్లాట్‌ఫారం మీదకు నెట్టేశారు.
??? | NEW: Passengers throw a guy off a train in Spain for not wearing a mask
— News For All (@NewsForAllUK) July 15, 2021
Also Read: