AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒరేయ్.. పోతార్రరేయ్.. కదులుతున్న రైలు కింద నుంచి దూరటం ఏంట్రా? ఒళ్లు గగుర్పొడిచే ఈ సీన్ చూశారంటే..

రైల్వే స్టేషన్లలో లేదా ట్రాక్‌ల సమీపంలో ప్రయాణికులు చేసే చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతటి ఘోర ప్రమాదాలకు దారితీస్తుందో చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రైల్వే శాఖ నిరంతరం హెచ్చరిస్తున్నప్పటికీ, కొందరు మాత్రం సమయం ఆదా చేసుకోవడానికో లేదా నిర్లక్ష్యంతోనో తమ ప్రాణాలను పణంగా పెడుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇంతకీ వైరల్‌ వీడియోలో ఏముందంటే..

ఒరేయ్.. పోతార్రరేయ్.. కదులుతున్న రైలు కింద నుంచి దూరటం ఏంట్రా? ఒళ్లు గగుర్పొడిచే ఈ సీన్ చూశారంటే..
Passengers Crossing Tracks
Jyothi Gadda
|

Updated on: May 23, 2026 | 4:25 PM

Share

ప్రతిరోజూ రైళ్లు, రైల్వే స్టేషన్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతుంటే, మరికొన్ని భయానకంగా ఉన్నాయి. ఇక్కడ పట్టాలపై నెమ్మదిగా కదులుతున్న ఒక రైలుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ రైలు ప్లాట్‌ఫాంను గానీ, పట్టాలను గానీ పూర్తిగా దాటకుండానే, అవతలి వైపు నిలబడి ఉన్న కొందరు వ్యక్తులు ఆగకుండా, రైలు కింద నుంచే నేరుగా పట్టాలను దాటడం మొదలుపెట్టారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇలా చేస్తున్న వారిలో కేవలం యువకులే కాకుండా, కొందరు మహిళలు కూడా కనిపిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన చర్యను చూసి అక్కడివారు భయభ్రాంతులకు గురయ్యారు. మరికొందరు ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు (Goods Train) నెమ్మదిగా కదులుతూ సాగిపోతోంది. అయితే, అవతలి ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లడానికి ఓపిక లేని కొందరు ప్రయాణికులు.. ఓవర్‌బ్రిడ్జ్ ఉపయోగించడానికి బదులుగా, ఏకంగా ఆ కదులుతున్న రైలు కింద నుంచే అవతలి వైపునకు దాటడం ప్రారంభించారు. మొదట ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న లగేజ్ బ్యాగ్‌ను అవతలి వైపు విసిరేసి, చాలా వేగంగా కదులుతున్న రైలు చక్రాల మధ్య నుండి దూరి అవతలికి వెళ్లాడు. అతన్ని చూసి వెనుకాలే ఉన్న మరో మహిళ, మరికొందరు వ్యక్తులు కూడా అదే విధంగా కదులుతున్న రైలు కింద నుండి దూరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఆ సమయంలో రైలు వేగం గనుక కాస్త పెరిగి ఉంటే, ఊహించని పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ హృదయ విదారక, ప్రమాదకరమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు వ్యక్తుల ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నిమిషాల సమయం కోసం జీవితాన్నే పణంగా పెడతారా? అని కొందరు ప్రశ్నిస్తుండగా.. మరికొందరు ఇలాంటి వారిపై రైల్వే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి, జరిమానాలు విధించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా, ఈ వీడియో రైల్వే భద్రతపై ప్రయాణికులకు ఉండాల్సిన కనీస అవగాహనను, బాధ్యతారాహిత్యాన్ని మరోసారి ఎత్తిచూపింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us