Watch: అయ్యో రామా.. రీల్స్ కి బానిసైన చిలుకమ్మ.. యూ ట్యూబ్‌లో ఏం చూస్తుందో తెలిస్తే..

ఈ రోజుల్లో ఫోన్ అలవాటు అనేది ప్రతిఒక్కరికీ ఒక వ్యసనంగా మారి అందరినీ ఇబ్బంది పెడుతోంది. ప్రతి ఒక్కరూ తమ రోజును చేతిలో సెల్‌ ఫోన్‌తోనే ప్రారంభిస్తారు. చిన్న పిల్లలు, యువకులు, వృద్ధులు అయినా సరే.. అందరూ తమ ఫోన్‌లకు బానిసలుగా మారిపోయారు. కానీ, మనుషులు ఫోన్‌లకు బానిసలుగా మారారు సరే.. కానీ, జంతువులు, పక్షులు కూడా ఫోన్లకు బానిసలైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఎంత షాకింగ్‌గా ఉంటుందో కదా.. ఇటీవల ఇంటర్నెట్‌లో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక చిలుక హ్యాపీగా ఫోన్‌ను వాడుతూ కనిపిస్తుంది.

Watch: అయ్యో రామా.. రీల్స్ కి బానిసైన చిలుకమ్మ.. యూ ట్యూబ్‌లో ఏం చూస్తుందో తెలిస్తే..
Parrot

Updated on: Nov 29, 2025 | 12:26 PM

వైరల్ వీడియోలో ఒక చిలుక ఫోన్‌ను ఆపరేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆశ్చర్యకరంగా ఆ చిలుక ఫోన్‌ను చూడటం మాత్రమే కాదు, వాస్తవానికి దాన్ని ఆపరేట్ చేస్తుంది. చిలుక ఫోన్ వెనుక బటన్‌ను నొక్కి వెంటనే యూట్యూబ్‌ను తెరుస్తుంది. ఫోన్‌లో ఆ చిలుక వీడియోలు చూడటం ప్రారంభిస్తుంది. అంతే కాదు, మనకు నచ్చకపోతే మనం వీడియోను స్క్రోల్ చేసినట్లుగా చిలుక కూడా వీడియోను స్క్రోల్ చేస్తూ కనిపిస్తుంది. తరువాత మరొక ఆసక్తికరమైన పనిచేసింది. ఒక వీడియో చూస్తున్నప్పుడు అందులో దానికి ఒక చిలుక కనిపిస్తుంది. అది దానిని చూడటమే కాకుండా దానిని లైక్‌ చేస్తుంది. ఇది ఆ చిలుక ఎంత తెలివైనదో స్పష్టంగా చూపిస్తుంది.

వైరల్‌ వీడియోలో ఆ చిలుక తెలివితేటలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూస్తుంటే ఆ చిలుకకు ఫోన్ ఎలా ఉపయోగించాలో బాగా తెలుసని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన చాలా మంది చాలా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

కొంతమంది చిలుక చాలా తెలివైనదని కామెంట్ చేయగా, మరికొందరు చిలుక కూడా యాడ్స్‌ వస్తే తట్టుకోలేక పోయిందని అన్నారు. మరికొందరు అమెరికా ఏమి చెబుతోందని అడిగారు. ఒకరూ ఫన్నిగా చిలుక కూడా రీల్‌కు బానిసైందని రాశారు. మొత్తానికి ఈ వీడియోకి భిన్నమైన, ఫన్నీ కామెంట్లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..