
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో ప్రతి సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫన్నీ వీడియోలే కాకుండా.. భయంకరమైన వీడియోలు సైతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ఇలాంటి వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నిత్యం జంతువులకు సంబంధించిన విషయాలు..వాటి అల్లరి చేష్టల వీడియోలను నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మనుషుల మాదిరిగానే.. జంతువులు కూడా కొత్త వస్తువులను చూడటానికి.. వాటిని అనూసరించడానికి ఆసక్తి చూపిస్తాయి. తాజాగా కొన్ని కుక్క పిల్లలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నవ్వులు పూయిస్తుంది. ఓ రిమోట్ కారు వెనకాల కుక్కలు పరుగెడుతున్న వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. హ్యూమర్ అండ్ ఎనిమల్స్ అనే ట్విట్టర్ యూజర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. అందులో ఓ పార్క్లో రిమోట్ కారు చుట్టూ కొన్ని కుక్కలు పరుగెడుతూ ఉన్నాయి. ఆ రిమోట్ కారును అందుకోవడానికి అవి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. అందులో దాదాపు 20 కుక్కలు ఆ కారును పట్టుకోవడానికి దాని వెంట పడుతున్నాయి. ఈ ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్స్ విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కారు బ్యాటరీ పూర్తయ్యే వరకు వాటిని ఆడించాలి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. కుక్కలు.. రిమోట్ కారు పార్కుకు వస్తే ఇలాగే ఉంటుందని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో 58.4కే లైక్స్ అందుకుంది. మరి ఆ ఫన్నీ వీడియోను మీరు చూసేయ్యండి.
ట్వీట్..
this is what happens when you bring an rc car to the dog park
(jukin media) pic.twitter.com/2qqIzvWBwb— Humor And Animals (@humorandanimals) September 18, 2021
Also Read: Bigg Boss 5 Telugu: మరోసారి ఇంట్లో నామినేషన్స్ రచ్చ.. పనికిమాలిన రీజన్స్ అంటూ ఫైర్ అయిన ప్రియాంక..
Chandramukhi 2 : చంద్రముఖి 2 ఆలస్యం కావడానికి అదే కారణమా.. రంగంలోకి దిగిన లారెన్స్..