ఆకుపచ్చ కోడి.. కాదు చిలుక ధర కేవలం రూ. 6,500 మాత్రమే.. సరసమైన ధరకే ఆన్‌లైన్‌లో అమ్మకానికి..

|

May 17, 2023 | 9:12 AM

పాకిస్తాన్‌లో ఒక వ్యక్తి చేసిన ప్రయోగం ఫోటో వైరల్ అవుతోంది. ఇది చాలా మందిని విస్మయానికి గురిచేస్తుంది. ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. ఇంతకీ ఈ ఫోటోలో ఏముందో తెలిస్తే మాత్రం మీరు కూడా షాక్ తగిలి షేక్ అవుతారు..? ఎవర్రా మీరంతా అంటూ తలలు పట్టుకోవాల్సిందే..!

ఆకుపచ్చ కోడి..  కాదు చిలుక ధర కేవలం రూ. 6,500 మాత్రమే.. సరసమైన ధరకే ఆన్‌లైన్‌లో అమ్మకానికి..
Paints Hen Green
Follow us on

ఇంటర్నెట్ అనేది ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. కొన్నకొన్నిసార్లు మీరు వింత వింతల వీడియోలను చూస్తుంటాం. కొన్నిసార్లు కొందరు వ్యక్తులు చేసే విచిత్ర పనులతో ఆశ్చర్యపోతుంటాం. అలాంటి వాటిని, వారిని చూసిన తర్వాత మన కళ్ళను మనమే నమ్మలేం. మనస్సు గందరగోళానికి గురవుతుంది.. ఇప్పుడు అలాంటి వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది అద్భుతంగా జూదమాడుతున్న ఫొటోలు, వీడియోలు చూస్తుంటాం. అంతేకాదు, ఈ జుగాడ్లలో ఎక్కువగా మన దేశానికి చెందినవి కాగా మరికొన్ని ఇతర దేశాలకు చెందినవి కూడా ఉంటాయి.. ప్రస్తుతం, పాకిస్తాన్‌లో ఒక వ్యక్తి చేసిన ప్రయోగం ఫోటో వైరల్ అవుతోంది. ఇది చాలా మందిని విస్మయానికి గురిచేస్తుంది. ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. ఇంతకీ ఈ ఫోటోలో ఏముందో తెలుసుకుందాం.

ఒక పాకిస్థానీ వ్యక్తి కోడి పుంజుకు ఆకుపచ్చ రంగు వేసి ఆన్‌లైన్‌లో చిలుక అని చెబుతూ అమ్మకానికి పెట్టాడు. ఇదే ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. అయితే, ఈ సంఘటన నిజంగా జరిగిందా.? లేదంటే అదేమైనా పుకారు వ్యాప్తి చేశారా..? అనేది మాత్రం ఇంకా ధృవీకరించబడలేదు. అయితే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ చేసిన క్లెయిమ్ చదివిన నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. వైరల్ ఫోటోలో ఆకుపచ్చ రంగు కోడి కనిపిస్తుంది. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన ఓ వ్యక్తి కోడిపై ఆకుపచ్చ రంగువేసి చిలుకగా OLXలో విక్రయానికి పెట్టాడు. ఈ పెయింటెడ్ కోడి ధర రూ. 6,500 చెప్పాడు. చౌక ధరలకు చిలుకలను విక్రయిస్తున్నట్లు ఓఎల్‌ఎక్స్‌లో కూడా ప్రకటించాడు. అయితే ఓ వ్యక్తి ఈ చిలుకను కొనుగోలు చేయగా.. అది తాను కొన్న చిలుక కాదని, రంగు వేసిన కోడి అని తెలియటంతో బిత్తరపోయి.. తెల్లముఖం వేసుకున్నాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

ఇక వైరల్‌ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేశారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసిన ఆ వ్యక్తి తాగి ఉన్నాడా..? అని ప్రశ్నించగా, మరొకరు.. ఇలా వ్రాశారు, ఉదయం ఆ చిలుక ఎలాంటి శబ్దం చేసిందో వినలేదా..? అంటూ నిలదీశారు. ప్రపంచంలో ఎవరూ చేయలేని ఇలాంటి పనులు కేవలం పాకిస్థానీయులు మాత్రమే చేయగలరని షేక్ అనే వినియోగదారు రాశారు. వసీమ్ అనే వినియోగదారు ఇలా వ్రాశాడు.. ప్రజలకు సున్నం పూయడంలో ఎవరూ పాకిస్థానీలను అందుకోలేరని అంటుండగా, దీనినే వ్యాపారం అంటారు. పాకిస్తాన్‌లో ఇలాంటి వారికి అసాధ్యం అంటూ ఏదీ లేదని రాశారు..ఇలా చాలా మంది వినియోగదారులు స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..