ఆయన చూస్తే చాలు మైకులు వణికిపోతాయి.. అంతే కాదు ఎగిరిపోతాయి.. ఆయనే ఇప్పుడు పాకిస్తాన్ కొత్త ప్రధాని షాబాజ్ షరీఫ్. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఓడించి ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చారు. పాకిస్తాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి షాబాజ్ షరీఫ్‌కు(Shahbaz Sharif ) చాలా సార్లు అవకాశం దక్కింది. కానీ.. ఆయన తన స్టైల్ మార్చుకోలేదు. షాబాజ్ షరీఫ్ సోధరుడు నవాజ్ షరీఫ్ మాత్రం అవినీతి ఆరోపణలపై అరెస్టు అయ్యారు. ఆయన జైలు నుంచి విడుదలయి దేశం విడిచి పెట్టి వెళ్లినప్పటి నుంచి తిరిగి దేశంలో అడుగుపెట్టలేదు. ఆయనకు విదేశాల్లో చికిత్స జరుగుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఎదిగిన షాబాజ్ షరీఫ్ రాజకీయ ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన ప్రసంగాలు, ర్యాలీలు జరిగే సమయంలో విప్లవ గీతాలు పాడటం ఆయన స్టైల్. ఆయన ప్రసంగించే సభల్లో జుల్ఫికర్ అలీ భుట్టోను అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు. తన ముందుండే మైకును కింద పడేయటం లాంటివి చేస్తుంటారు. ఈ రకమైన ప్రవర్తనను పాకిస్తాన్ టీవీ చానెళ్లు కూడా ఎగతాళి చేసేవి.. అంతేకాదు పాకిస్తాన్ మీడియాకు ఆయన ఓ కామెడీ అని చెప్పాలి.
దీంతో ఆయన పాకిస్తాన్ నూతన ప్రధాని అని ప్రకటించిన వెంటనే నెట్టింట పాత వీడియోలు వైరల్ అవుతున్నారు. గతంలో తాను చేసిన కొన్ని ప్రసంగాల తాలూకు వీడియోల క్లిప్పులు టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయాయి. గతంలో ఆయన వివిధ సందర్భాల్లో వేదికలపై ప్రసంగిస్తూ చేతులను వేగంగా కదిలించేవారు.
Entertainment will continue in Pakistan. Meet Shahbaz Sharif Next PM of Pakistan & his Highly Entertaining Hand Movements ?? #ShahbazSharif #ImranKhan pic.twitter.com/8jSGMsTUDz
— Rosy (@rose_k01) April 9, 2022
ఆ ఊపుడుకు ఆయన ఎదుట ఉన్న మైక్‌లు కూడా గాల్లోకి ఎగిరాయి. ఒక్కో సమయంలో ఒక్కో మైక్ అలా ఎగురుకుంటూ ముందున్న వారిమీద పడిపోతున్నాయి.. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mic be like: https://t.co/ekAQQxyK9Q pic.twitter.com/wc3aAaQLnk
— ?? (@Sandeep42420) April 10, 2022
అటు పాకిస్తాన్, ఇండియాలోనూ ఇంటర్ నెట్‌వేదికగా వీడియో హల్ చల్ చేస్తోంది. అంతే మీమ్స్ కూడా తెరమీదికి వచ్చాయి. ఇక రాబోయే రోజుల్లో మైకులు జాగ్రత్త అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: Hyderabad: సమయం లేదు మిత్రమా.. బంపర్ ఆఫర్ మూడు రోజులే.. ఆ తర్వాత మీకు ఫుల్ బ్యాండే..
Coronovirus: కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి ఉండదా?.. స్టన్నింగ్ రిపోర్ట్..