
పాకిస్తానీ డిజిటల్ కంటెంట్ సృష్టికర్త అమర్ ప్రకాష్ కరాచీలో జరిగే గణేష్ వేడుకలను వీడియోల ద్వారా వైరల్‌గా మారి ప్రజల దృష్టిని ఆకర్షించాడు. మహారాష్ట్రలో ఎలా జరుపుకుంటారో అదే విధంగా మైనారిటీ హిందూ సమాజాలు కరాచీలో గణేష్ వేడుకలను కలిసి కట్టుగా జరుపుకుంటున్నారు. దీంతో పాకిస్తాన్‌లోని హిందూ సమాజం పవిత్ర పండుగ, దాని అన్ని సంప్రదాయాలను ఆనందంతో నిలబెట్టినందుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గణేష్ నిమజ్జన ఊరేగింపు వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వైరల్‌గా మారింది. ఇక్కడ గణేశుడి విగ్రహాన్ని పూర్తి వేడుక, ఉత్సాహంతో నిమజ్జనం కోసం తీసుకెళ్లారు. భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ సాంప్రదాయ ధోల్ సంగీతానికి నృత్యం చేస్తూ కనిపించారు.
ఒక వీడియోలో, అందంగా అలంకరించబడిన గణేష్ పండల్ వద్ద అందరూ భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి, ధోల్-తాషా వాయిద్యాలతో సాంప్రదాయ హారతిని పాడటం, నిమజ్జన వేడుకలు జరుపుకోవడం ద్వారా కరాచీ నివాసితులు ఎలా ఐక్యంగా ఉన్నారో చూపించారు.
కరాచీ నుండి వచ్చిన ఒక కొత్త వీడియోలో గణేష్ విగ్రహాన్ని చూడటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలాగే సమీపంలోని వేదికపై శివుడు, గణేశుడు, పార్వతి దేవి వేషధారణలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు.
Ganesh Chaturthi in Pakistan.
-No chaos to disrupt peace.
-No slogans to provoke.
-No vulgarity to offend.
-No provocations to incite.That’s difference between Pakistan’s minority and India’s majority. pic.twitter.com/gh4CPrjX3g
— هارون خان (@iamharunkhan) August 28, 2025
పాకిస్తాన్‌లో గణేష్ నిమజ్జన ఊరేగింపు ఎలా జరిగిందో ఒక విభిన్నమైన వీడియో కూడా వైరల్ అవుతోంది. భక్తి సంగీతం, భక్తుల గణపతి బప్పా మోరియా నినాదాల మధ్య, పోలీసుల భారీ బందోబస్తుతో హిందూ చిహ్నాన్ని సూచించే నారింజ జెండాలను పట్టుకుని బైక్‌లపై ఊరేగింపుగా బయల్దేరారు. పాకిస్తాన్‌లో పెద్ద ఎత్తున జరుగుతున్న గణేశోత్సవాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
Ganesh immersion in Pakistan 🚩🚩🚩 pic.twitter.com/wI9r2kToog
— ಸನಾತನ (@sanatan_kannada) August 31, 2025
పాకిస్తాన్‌లోని మరాఠాలు వారసత్వాన్ని స్వీకరించే స్ఫూర్తికి ఆన్‌లైన్ కమ్యూనిటీ సమిష్టిగా మద్దతు ప్రకటించింది. భారతదేశం నుండి, ముఖ్యంగా మహారాష్ట్ర నుండి అనేక మంది ఇంటర్నెట్ వినియోగదారులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..