ఫ్రీజర్ బాక్స్ లో ఉంచి, పూల దండలు వేసి.. పెంపుడు కుక్కకు ఘనంగా నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు.. ఎక్కడంటే..

| Edited By: Ravi Kiran

Feb 23, 2022 | 8:01 AM

సన్నీకి తాను చనిపోతానని ముందే తెలిసిందా... తనను ఎంతో గారాబంగా పెంచిన కుటుంబ సభ్యులతో చివరి క్షణాల్లో గడపాలని భావించి అందరి చుట్టూ తిరిగిందా?.

ఫ్రీజర్ బాక్స్ లో ఉంచి, పూల దండలు వేసి.. పెంపుడు కుక్కకు ఘనంగా నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు.. ఎక్కడంటే..
Follow us on

సన్నీకి తాను చనిపోతానని ముందే తెలిసిందా.. తనను ఎంతో గారాబంగా పెంచిన కుటుంబ సభ్యులతో చివరి క్షణాల్లో గడపాలని భావించి అందరి చుట్టూ తిరిగిందా? చివరి క్షణాల్లో తాను చనిపోతానని తెలిసి మూగవేదన అనుభవించిందా? సన్నీ గురించి కుటుంబ సభ్యులు చెబుతుంటే అలాగే అనిపిస్తోంది. సన్నీ అనుకున్నట్టుగానే ఆడుతూ, తిరుగుతూ తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.. అప్పటికే సన్నీ చనిపోయిందని డాక్టర్‌ చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సన్నీకి ఘనంగా అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకీ తన మరణాన్ని ముందే పసిగట్టిన ఆ సన్నీ ఎవరు.. ఏంటా విషాదం తెలుసుకుందాం రండి.

కుటుంబ సభ్యుడిని కోల్పోయాం..

పెంపుడు కుక్కలు విశ్వాసానికి మారుపేరు.  అందుకే చాలామంది వాటిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు. అలాంటి ఓ జర్మన్‌ షెఫర్డ్‌ జాతికి చెందిన ఓ కుక్క ప్రకాశంజిల్లా అద్దంకిలో చనిపోయింది. సన్నీ అని పేరుపెట్టి 13 ఏళ్ళుగా పెంచుకున్న ఆ కుక్క చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. కుటుంబంలో ఒకరు చనిపోయారంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఇంట్లో మనిషి చనిపోతే ఫ్రిజ్‌బాక్స్‌లో ఎలా పెడతారో అలా ఆ కుక్కను కూడా ఫ్రీజర్ బాక్స్ లో  పెట్టి తమ ప్రేమను చాటుకున్నారు. ఆ మూగజీవికి ఘనంగా నివాళులు అర్పించి ఉదయం అంత్యక్రియలు చేయడానికి సిద్ధమయ్యారు. అద్దంకి పట్టణానికి చెందిన అడుసుమల్లి కిషోర్ బాబు ఇంట్లో పెంపుడు కుక్క చనిపోగా మార్చురీ బాక్స్ లో పెట్టి మనుషుల చనిపోతే ఏవిధంగా అంత్యక్రియలు చేస్తారో, అదేవిధంగా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరణించిన చనిపోయిన కుక్క ను చూసేందుకు కాలనీలోని పిల్లలు, పెద్దలందరూ తరలి వచ్చారు. పూలదండలు తెచ్చి నివాళులు అర్పించారు. అంత్యక్రియలు చేసేందుకు ఘనంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సన్నీ చనిపోయే ముందు తన యజమాని కిషోర్‌బాబు చుట్టూ ఆందోళనగా తిరిగింది. తాను చనిపోతానని ముందే తెలిసినట్టు మిగిలిన కుటుంబ సభ్యులను తనివితీరా చూసుకుంది. చివరకు తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది. కుక్క చనిపోతే కుటుంబ సభ్యుడు చనిపోయినట్టు కిషోర్‌బాబు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించడం మూగజీవాల పట్ల వారికున్న ప్రేమను తెలియచేస్తుందని స్థానికులు చెబుతున్నారు.

ఫిరోజ్, టీవీ9, ఒంగోలు

Also Read: TTD: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. మార్చి 10న విదేశీ నాణేల ఈ-వేలం… వినియోగించుకోండి

Afghanistan-India: తీవ్ర ఆహార సంక్షోభంలో ఆఫ్గన్‌ ప్రజలు.. పాక్‌ మీదుగా 2,500 టన్నుల గోధుమలను పంపిణీ చేసిన భారత్‌!

Telangana BJP: పార్టీ అధ్యక్షుడి సొంత జిల్లాలో సీక్రెట్‌ మీటింగ్స్‌ కలకలం.. తగ్గేదే లే అంటున్న బండి సంజయ్..