Viral Video: అమ్మ సృష్టిలో ఇంతకన్నా కమ్మనైన, స్వచ్ఛమైన ప్రేమ ఉండదు. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ తల్లిప్రేమ ఉంటుంది. మనుషుల మాదిరిగానే జంతువులు తమ బిడ్డ పట్ల ఎంతో ప్రేమానురాగాలతో ఉంటాయి. పిల్లల జోలికి ఎవరైనా వస్తే అవి ఊరుకోవు ప్రాణాలకు తెగించి మరి పోరాడుతాయి. అలాగే తన పిల్లలు కాకపోయినా కొన్ని జంతవులు అమ్మతనం చూపుతూ ఉంటాయి. వాటిని దగ్గరకు తీసుకొని లాలిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో నెటిజనుల మనసులను గెలుచుకుంటుంది. ఈ వీడియో పై రకరకాల కామెంట్లు షేర్ చేసుకుంటున్నారు. ఈ వీడియో ఓ ఒరంగుటాన్ చేసిన పనికి అందురు ఫిదా అవుతున్నారు.
వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఒక ఒరంగుటాన్ పులి పిల్లలను ఆడిస్తూ కనిపించింది. ఒరంగుటాన్ మూడు పులి పిల్లలతో ప్రేమగా లాలిస్తూ ఆడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.ఈ వైరల్ ఫుటేజ్ సౌత్ కరోలినాలోని మర్టల్ బీచ్ సఫారీ లోనిది. అలాగే పులి పిల్లలకు పాలు పడుతూ ఎంతో ప్రేమ గా చూసుకుంటుంది ఆ ఒరంగుటాన్ ఇప్పుడు ఈ వీడియో పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. మనుషుల కంటే జంతువులు చాలా మంచివని కొందరు, మనుషుల కంటే జంతువులు ఉత్తమమైనవి, తల్లి ప్రేమ హద్దులు లేనిది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మనసుకు హత్తుకుంటోన్న ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
Any suitable caption for this beautiful clip?…. pic.twitter.com/NBWQzXSnf7
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) June 30, 2022