Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలో ఎర కోసం దాగున్న పామును కనిపెడితే మీరే జీనియస్..

|

Jun 19, 2022 | 1:09 PM

మనం సాల్వ్ చేసిన సుడోకోలు, 'ఫైండ్ ది ఆడ్' పజిల్స్ ఒక ఎత్తయితే.. ఈ ఫోటో పజిల్స్ మరో ఎత్తు. సవాళ్లు ఇష్టపడేవారికి.. వీటిని సాల్వ్ చేయడం మహా సరదా..

Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలో ఎర కోసం దాగున్న పామును కనిపెడితే మీరే జీనియస్..
Snake
Follow us on

ఇంటర్నెట్‌లో ఎన్నో రకాల ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే అందులో కొన్ని ప్రత్యేకమైనవి. అందులో ఉండే రహస్యాలను కనుగొనాలంటే మన కళ్లకు పదును పెట్టాల్సిందే.. అలాంటి వాటినే ఫోటో పజిల్స్ అని అంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వీటిదే ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో మనం సాల్వ్ చేసిన సుడోకోలు, ‘ఫైండ్ ది ఆడ్’ పజిల్స్ ఒక ఎత్తయితే.. ఈ ఫోటో పజిల్స్ మరో ఎత్తు. సవాళ్లు ఇష్టపడేవారికి.. వీటిని సాల్వ్ చేయడం మహా సరదా.. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలో మీరేం గమనిస్తున్నారు.. అడవిలా ఉన్న ఆ ప్రాంతంలో నేలపై అంతా ఎండిపోయిన ఆకులు, రాళ్లు ఉన్నాయి. ఇక అందులోనే ఓ విషసర్పం నక్కి ఉంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి ఈజీగానే ఉన్నా.. ఈ పజిల్ చాలా కష్టం గురూ.. అక్కడున్న ఆకుల మధ్య ఎర కోసం తనకు తాను నక్కిన పామును గుర్తించడం అసాధ్యం. ఒకవేళ మీ కళ్లు డేగ కళ్ళైతే.. చిటికెలో పామును గుర్తించేయొచ్చు. మీరు మేధావి అయితే సెకెన్లలో ఫోటో పజిల్ సాల్వ్ చేయండి చూద్దాం.. లేట్ ఎందుకు ట్రై చేయండి. ఒకవేళ మీకు సమాధానం దొరక్కపోతే కింద ఫోటోను చూడండి.