Optical Illusion: ఈ ఫోటోలో పులిని కనిపెట్టండి.. మొదటిగా మీరేం చూస్తారో అదే మీ వ్యక్తిత్వం.!

|

Apr 28, 2022 | 1:55 PM

ఆప్టికల్ ఇల్యూషన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే కొత్త ట్రెండ్.. మనలో ఎలా రెండు వ్యక్తిత్వాలు ఉంటాయో..

Optical Illusion: ఈ ఫోటోలో పులిని కనిపెట్టండి.. మొదటిగా మీరేం చూస్తారో అదే మీ వ్యక్తిత్వం.!
Tiger
Follow us on

ఆప్టికల్ ఇల్యూషన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే కొత్త ట్రెండ్.. మనలో ఎలా రెండు వ్యక్తిత్వాలు ఉంటాయో.. అలాగే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలలో కూడా పైకి కనిపించేది ఒకటి.. లోపల కనిపించేది మరొకటి.. వీటిల్లో ఉండే రహస్యాన్ని కనిపెట్టేందుకు నెటిజన్లు తెగ కష్టపడుతుంటారు. ఇక సవాళ్లు అంటే ఇష్టపడేవారు.. వీటిపై ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. సహజంగా సండే బుక్స్‌లో వచ్చే పజిల్స్‌నే తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతుంటాం.. మరి ఇవి మనకు సవాల్ విసిరితే ఊరుకుంటాం.. సాల్వ్ చేసి తీరుతాం అంతే.. మరి ఈ కోవకు చెందిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం పదండి..

పైన పేర్కొన్న ఫోటోను మీరు ఒకసారి నిశితంగా పరిశీలిస్తే.. కొమ్మను పట్టుకుని ఓ కోతి ఊగిసలాడుతున్నట్లు మీరు చూడవచ్చు. కానీ అందులో ఓ పులి కూడా ఉంది. మీ కళ్లకు పదునుపెట్టి చూస్తే పులి తల కనిపిస్తుంది. మరి అవి రెండూ మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతున్నాయో చూద్దాం..

పులి తల:

మీరు మొదటిగా పులి తలని గమనించినట్లయితే, మీ మెదడు చాలా చురుకుగా పని చేస్తుందని అర్ధం. ప్రతీ విషయంలోనూ నిర్ణయాన్ని తీసుకునే ముందు పక్కా ప్లాన్ వేసుకుని.. దాన్ని విశ్లేషిస్తారు. అలాగే మీరు మొండిగా ఉంటారు.. ఇతరుల అభిప్రాయాలను విస్మరిస్తారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు ప్లాన్ చేయడానికి మరియు విశ్లేషించడానికి ఇష్టపడే వ్యక్తి. మీరు చాలా తార్కిక మరియు గణనతో ఆలోచించిన తర్వాత నిర్ణయించుకున్నందున, మీరు మొండిగా ఉంటారు మరియు ఇతరుల అభిప్రాయాలను విస్మరిస్తారు.

వ్యక్తిత్వ లక్షణాలు: ప్లానర్, లాజికల్ పర్సన్, హేతుబద్ధంగా ఉంటారు, వాస్తవికత, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు.

కోతి:

మీరు మొదటిగా వేలాడుతున్న కోతిని చూసినట్లయితే, మీకు సృజనాత్మక ఆలోచన ఉన్నట్లు అర్ధం. క్రిటికల్ థింకింగ్‌కు బదులుగా అంతర్ దృష్టి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు.

వ్యక్తిత్వ లక్షణాలు: ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. ఎమోషనల్, క్రియేటివ్, అంతర్ దృష్టితో ఆలోచిస్తారు. కలలు కంటూ ఉంటారు.