Photo Puzzle: చెత్త డబ్బా గాల్లో ఎలా తేలుతుందబ్బా.? ట్విస్ట్‌ తెలిస్తే థ్రిల్ అవ్వడం పక్కా..

కళ్లకు కనిపించేదంతా నిజం కాదుంటుంటారు. కొన్ని దృశ్యాలు చూసే కళ్లను మాయ చేస్తుంటాయి. వీటినే ఆప్టికల్ ఇల్యూజన్స్‌గా పిలుస్తుంటారు. మాములుగా ఉండే అంశాలే ఆసక్తిని కలిగిస్తుంటాయి. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఫొటోలు బాగా వైరల్‌ అవుతున్నాయి...

Photo Puzzle: చెత్త డబ్బా గాల్లో ఎలా తేలుతుందబ్బా.? ట్విస్ట్‌ తెలిస్తే థ్రిల్ అవ్వడం పక్కా..
Photo Puzzle

Updated on: Jun 26, 2023 | 4:30 PM

కళ్లకు కనిపించేదంతా నిజం కాదుంటుంటారు. కొన్ని దృశ్యాలు చూసే కళ్లను మాయ చేస్తుంటాయి. వీటినే ఆప్టికల్ ఇల్యూజన్స్‌గా పిలుస్తుంటారు. మాములుగా ఉండే అంశాలే ఆసక్తిని కలిగిస్తుంటాయి. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఫొటోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. ఎక్కడెక్కడో దొరికిన ఫొటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ ఫొటోలో ఉన్న ట్విస్ట్‌ తెలుసుకున్న నెటిజన్లు వారెవ్వా అంటున్నారు. పైన ఉన్న ఫొటో చూడగానే మీకు ఏం కనిపిస్తోంది.? చెత్త డబ్బ గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తోంది కదూ! ఏదో ఫొటో షాప్‌లో చేసిన మ్యాజిక్‌ ఇది అంటారా.? అయితే ఇదంతా ఫొటో మాయజాలమే. ఫొటోగ్రాఫర్‌ ఫొటోను తీసిన విధానమే దీనికి కారణం.

ఇవి కూడా చదవండి

చెత్త డబ్బ గాలిలో ఉన్నట్లు మనకు భావన కలగడానికి ప్రధాన కారణం కింద నీడలా కనిపించడమే. అయితే అది నిజానికి నిజమైన నీడ కాదు, టైల్స్‌పై నిలిచిన నీరు. ఆ నీటిపై ఉన్న ప్రాంతంలో చెత్త డబ్బా ఉంది. దీంతో చెత్తడబ్బ గాలిలో తేలుతున్న భావన కలుగుతోంది. ఇదండి ఈ చెత్తడబ్బ వెనకాల ఉన్న అసలు కథ.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..