మీరు ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటివి యూజ్ చేస్తున్నారా..? అయితే తికమక పెట్టే ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటో పజిల్స్ మీకు తారసపడే ఉంటాయ్. ఇవి ఇప్పుడు నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. చిక్కు ప్రశ్నల మాదిరిగా జనాలతో దోబూచులాడుతున్నాయి. మన కళ్ల ఫోకస్ ఏ లెవల్‌లో ఉందో తెలుసుకునేందుకు ఇలాంటి పజిల్స్ సాయపడతాయ్. అదే అండీ ఈ ఫోటోలో కనిపిస్తున్న నంబర్ ఏంటి..? ఈ ఫోటోలోని జంతువుని కనిపెట్టగలరా..? వస్తువును గుర్తించగలరా..? లాంటి పజిల్స్. ఇంత సమయంలో కనిపెట్టాలి అనేది లేకపోతే.. కొద్దిసేపు పరీక్షగా చూసి సమాధానం పట్టేందుకు నెటిజన్స్ ట్రై చేస్తారు. కానీ టైమ్ లిమిట్ పెట్టి.. కనిపెట్టమంటే టెన్షన్‌తో కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారు. అప్పుడే తప్పులో కాలేస్తారు.
అలాంటి ట్రిక్కీ పజిల్‌తో మీ ముందుకు వచ్చాం. మీరు పైన చూస్తున్న చిత్రం ఓ మంచు కురుస్తున్న ప్రాంతంలో తీసింది. అక్కడ ఓ గుడ్లగూబ ఉంది. అక్కడి చెట్ల మధ్య అది ఎగురుతూ ఉంది. దాన్ని 20 సెకన్లలో మీరు గుర్తించాలి. అంత ఈజీ కాదండోయ్. కాస్తంత ఫోకస్ పెట్టాల్సిందే. లేదంటే అది మీకు అస్సలు చిక్కదు. కనుగుడ్లు బాగా పెద్దవి చేసి.. తీక్షణంగా చూస్తే.. ఏమైనా ఫలితం ఉండొచ్చు. లేదంటే మాత్రం ఈ పజిల్ మీతో రివర్స్ గేమ్ ఆడుకుంటుంది.
గుడ్లగూబ ఎక్కడుందో తెలిస్తే .. మీరు కంటి దృష్టి అదుర్స్ అంతే. దాని ఆచూకి పట్టినవాళ్లు దిగులు పడకండి. మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టారు.. అదే బెస్ట్ థింగ్. ఇక సమాధానం ఉన్న ఫోటోను మేము దిగువన ఇవ్వబోతున్నాం. నెక్ట్స్ టైమ్ ఇంకో సరికొత్త పజిల్‌తో మీ ముందుకు వస్తాం. బై.. బై.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..