
ఇలాంటి బొమ్మలు మనకు కేవలం సరదా మాత్రమే కాదు. ఇవి మన మెదడుకు ఒక వ్యాయామం లాంటివి. మీరు ఈ మాయను ఎంత తొందరగా గుర్తిస్తారనేది మీ కళ్ళ చూపుతో పాటు.. మీ మెదడు ఎంత చురుకుగా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఎందుకంటే ఇవి మన జ్ఞాపకశక్తి, ఒకేలాంటి వాటిలో తేడాను గుర్తించడం, స్థలాన్ని అర్థం చేసుకోవడం వంటి వాటిని పరీక్షిస్తాయి. ఇవన్నీ మన ఐక్యూ స్థాయిని చెప్పే లక్షణాలే.
శాస్త్రవేత్తలు చేసిన fMRI స్కాన్ ల ప్రకారం.. ఇలాంటి బొమ్మలను తొందరగా గుర్తించే వాళ్ళ మెదడులో కనెక్షన్లు బాగుంటాయి. వాళ్ళు విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు. కొత్తగా ఆలోచిస్తారు.
ఈ రోజు మన ఆప్టికల్ ఇల్యూషన్ మీ సెలెక్టివ్ అటెన్షన్ ని పరీక్షిస్తుంది. అంటే అవసరమైన దానిని మాత్రమే గుర్తించి.. మిగిలిన గందరగోళాన్ని పక్కన పెట్టే సామర్థ్యం. అంతేకాదు ఇది మీ మెదడు ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకు ఎంత త్వరగా మారగలదో కూడా పరిశీలిస్తుంది.
మన టాస్క్ విషయానికి వద్దామా.. మీరు చూస్తున్న ఈ చిత్రం లో నాలుగు రకాల రంగుల్లో చాలా ఏనుగులు ఉన్నాయి. కానీ వాటి మధ్య ఒక చిన్న పాండా కూడా ఉంది. మరి మీరు ఈ పాండాని కనిపెట్టగలరా..? కొంచం కష్టమైన టాస్క్ ఇది. కానీ మీరు ఇష్టంతో ఏకగాత్రతతో పాల్గొనండి. ఈజీగా కనిపెట్టేస్తారు. ఏదో ఆలోచనలో ఉండి ఈ పజిల్ లో పాల్గొంటే మాత్రం కనిపెట్టలేరు.
చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది మీకు. కేవలం 5 సెకన్లలోనే కనిపెట్టాలి. మేము చూడటం లేదు కదా అని ఎక్కువ టైమ్ వేస్ట్ చేయొద్దు. ఇచ్చిన టైమ్ లోనే టాస్క్ ఫినిష్ చేయండి. అప్పుడే బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది. దీనికి మీరు టైమర్ పెట్టండి. అప్పుడు ఇన్ టైమ్ లో టాస్క్ ఫినిష్ చేయొచ్చు. ఇది కేవలం మీ కళ్ళ చూపుకు మాత్రమే కాదు.. మీరు ఎంత త్వరగా చిన్న విషయాలను గమనించి.. వాటిని అర్థం చేసుకోగలరనే దానిపై ఆధారపడి ఉంటుంది.
మీరు 5 సెకన్లలో పాండాను గుర్తించారా.. అయితే మీకు అభినందనలు. మీకు అసాధారణమైన తేడాలను గుర్తించే సామర్థ్యం ఉంది. అంటే మీరు చాలా వేగంగా ఒకేలా కనిపించే వాటి మధ్య తేడాలను కనిపెట్టగలరు. ఇది మీ మెదడు గందరగోళంలో కూడా ఎంత వేగంగా సమాచారాన్ని అర్థం చేసుకుంటుందో చూపిస్తుంది.
ఇంకా కనిపెట్టని వారు ఆందోళన పడొద్దు. మీరు బాగానే ప్రయత్నించారు. మీకోసం మేము పాండా ఎక్కడ దాగి ఉందో చూపిస్తాం చూడండి. మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇక్కడే ఉందే కనిపెట్టలేదు అనుకుంటారు. ఇలాంటి బొమ్మలు మీ మెదడును చురుకుగా ఉంచడానికి సరదాగా ఉపయోగపడతాయి. వాటిని అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ.. మీ ఐక్యూ, అర్థం చేసుకునే శక్తి, విశ్లేషణ చేసే సామర్థ్యాన్ని పెంచుకోండి.