Optical Illusion: పచ్చదనం పరుచుకున్న ఈ ఫొటోలో మొసలి దాగుంది.. 10 సెకన్లలో కనిపెడితే మీరు గ్రేటే..

ఓ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. సరస్సులో పచ్చదనంతో పరుచుకున్న మొక్కల మధ్య మొసలి దాగుంది. దానిని కనుగునేందుకు నెటిజన్లు తెగ ఉత్సాహపడుతున్నారు.

Optical Illusion: పచ్చదనం పరుచుకున్న ఈ ఫొటోలో మొసలి దాగుంది.. 10 సెకన్లలో కనిపెడితే మీరు గ్రేటే..
Optical Illusion

Updated on: Aug 01, 2022 | 6:28 AM

Optical Illusion Test: సోషల్ మీడియా ఎన్నో వైరల్ న్యూస్‌కు వేదికగా మారుతోంది. ప్రతిరోజూ నెట్టింట అనే ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలను ఎక్కువగా ఇప్టపడుతుంటారు నెటిజన్లు. ఈ ఫొటోలు మెదడును చూరుకుగా మార్చడంతోపాటు చూపును మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా వీటితో మంచి టైంపాస్, ఎంజాయ్‌మెంట్ కూడా దొరుకుతుంది. తాజాగా ఓ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. సరస్సులో పచ్చదనంతో పరుచుకున్న మొక్కల మధ్య మొసలి దాగుంది. దానిని కనుగునేందుకు నెటిజన్లు తెగ ఉత్సాహపడుతున్నారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్‌లో దాగి ఉన్న మొసలిని..10 సెకన్లలో గుర్తిస్తే మీరు జీనియస్‌ అంటూ పేర్కొంటున్నారు.

ఈ చిత్రాన్ని సీటెల్‌కు చెందిన వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆర్ట్ వోల్ఫ్ తీశారు. ఈ ఆకర్షణీయమైన చిత్రంలో మొక్కలతో నిండి ఉన్న సరస్సును మనం చూడవచ్చు. దీనిలో మొసలి కూడా దాగుంది. ఈ సముద్ర మొక్కల మధ్య దాగి ఉన్న మొసలి దమ్ముంటే నన్ను కొనుగొనండి అంటూ సవాల్‌ కూడా చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫొటోను చెక్‌ చేసి 10 సెకన్లలో మొసలిని గుర్తించండి.. అలా చేస్తే మీ మైండ్‌ సూపర్బ్‌గా ఉన్నట్లేనని పేర్కొంటున్నారు.

ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోను గమనించండి..

ఇవి కూడా చదవండి

Crocodile

అయితే.. మీరు 10 సెకన్లను మొసలిని ఇంకా గుర్తించలేకపోతే.. మరో అవకాశం కూడా ఇస్తున్నాం.. మొక్కల మధ్య ఉన్న మొసలి ఓ కన్నుతో చూస్తుంది చూడండి.. అయితే.. దీనిని చాలామంది గుర్తించారు. అలాంటివారికి అద్భుతమైన పరిశీలనా నైపుణ్యాలు ఉన్నాయని చెప్పవచ్చు.

మొసలిని గమనించకపోతే.. ఈ కింది ఇచ్చిన ఫొటోను చూడండి..

Optical Illusion Test

పరిశీలన నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలంటే ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ను మీ స్నేహితులకు షేర్‌ చేసి.. సవాల్‌ చేసి ఆటపట్టించండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..