Optical illusion: దమ్ముంటే నన్ను కనిపెట్టండి అంటోన్న పిల్లి.. 5 సెకండ్లలో గుర్తిస్తే మీ కళ్లు చిరుత కళ్లే.

|

Feb 20, 2023 | 12:03 PM

ఆప్టికల్‌ ఇల్యూజ్‌ చూసే కళ్లను మాయ చేస్తుంటాయి. విజువల్‌ ఆప్టికల్‌ ఇల్యూజన్స్‌ మెదడును కన్ఫ్యూజ్‌ చేస్తుంది. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్స్‌ నెట్టింట వైరల్‌ అవుతూనే ఉన్నాయి. లిటరల్‌, ఫిజియోలాజికల్, కాగ్నిటివ్‌ ఇలా రకరకాల ఫొటోలు వైరల్‌...

Optical illusion: దమ్ముంటే నన్ను కనిపెట్టండి అంటోన్న పిల్లి.. 5 సెకండ్లలో గుర్తిస్తే మీ కళ్లు చిరుత కళ్లే.
Optical Illusion
Follow us on

ఆప్టికల్‌ ఇల్యూజ్‌ చూసే కళ్లను మాయ చేస్తుంటాయి. విజువల్‌ ఆప్టికల్‌ ఇల్యూజన్స్‌ మెదడును కన్ఫ్యూజ్‌ చేస్తుంది. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్స్‌ నెట్టింట వైరల్‌ అవుతూనే ఉన్నాయి. లిటరల్‌, ఫిజియోలాజికల్, కాగ్నిటివ్‌ ఇలా రకరకాల ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి ఛాలెంజింగ్‌ పజిల్స్‌ను సాల్వ్‌ చేయడానికి నెటిజన్లు సైతం ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే సహజంగా ఉండే ఆప్టికల్‌ ఇల్యూజన్‌ తాలుకూ ఫొటోలు మరింత ఆసక్తిని పెంచుతాయి. సహజంగా తీసిన ఫొటోల్లో కనిపించి కనిపంచకుండా ఉండే ఆబ్జెక్ట్స్‌ను కనిపెట్టడమే ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోల ముఖ్య ఉద్దేశం. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పైన కనిపిస్తోన్న ఫొటో చూడగానే ఏదో స్టోర్ రూమ్‌లాగా అనిపిస్తోంది కదూ.. అయితే ఇందులో ఓ పిల్లి దాగి ఉంది. గుర్తుపట్టారా?

దమ్ముంటే నన్ను కనిపెట్టండి అన్నట్లు.. నక్కి నక్కి చూస్తోంది. ఇంతకీ ఆ పిల్లిని మీరు కనిపెట్టారా.? 10 సెకండ్స్‌లో పిల్లిని కనిపెడితే మీ ఐ పవర్‌ సూపర్‌ అని నెట్టింట ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. ఒకసారి క్షుణ్నంగా ఫొటోను పరిశీలించండి పిల్లి కనిపిస్తుందేమో.? ఏంటి ఎంత వెతికినా కనిపించడం లేదా.! అయితే ఓసారి ఫొటోలో కనిపిస్తోన్న కబోర్డ్స్‌ను గమనించండి. కబోర్డ్స్‌కి కుడివైపు కింది నుంచి రెండో రాక్‌లో చూడండి.. ఓ పిల్లి వంగి వంగి బయటకు చూస్తోంది. కనిపించింది కదూ!

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..