Optical Illusion: బాబోయ్‌ నల్ల పాము.. ఈ ఫొటోలనే దాగి ఉంది, కనిపెట్టగలరా?

|

Jul 08, 2024 | 11:30 AM

ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోల్లో రకరకాలు ఉంటాయి. వీటిలో కొన్ని మన ఆలోచన శక్తిని అంచనా వేసేవి ఉంటే.. మరికొన్ని కంటి పవర్‌ను టెస్ట్ చేస్తాయి. సాధారణంగా కంటి పరీక్షను చెక్‌ చేసే ఫోటోలు పెద్దగా మెదడుకు పదును పెట్టేవి ఉండదు. కేవలం మీ ఐ పవర్‌ను టెస్ట్‌ చేస్తాయి. అయితే వీటిలో క్రియేట్ చేసిన ఫోటోలు మాత్రమే కాకుండా..

Optical Illusion: బాబోయ్‌ నల్ల పాము.. ఈ ఫొటోలనే దాగి ఉంది, కనిపెట్టగలరా?
Find Snake
Follow us on

ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలు అనగానే మనకు సహజంగా ఎడిటింట్‌ చేసిన ఫొటోలు, గ్రాఫిక్స్‌ ఫొటోలు గుర్తొస్తాయి. కానీ సహజంగా కెమెరాతో క్లిక్‌ మనిపించిన ఫోటోలు కూడా ఉంటాయని మీకు తెలుసా.? సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోల్లో రకరకాలు ఉంటాయి. వీటిలో కొన్ని మన ఆలోచన శక్తిని అంచనా వేసేవి ఉంటే.. మరికొన్ని కంటి పవర్‌ను టెస్ట్ చేస్తాయి. సాధారణంగా కంటి పరీక్షను చెక్‌ చేసే ఫోటోలు పెద్దగా మెదడుకు పదును పెట్టేవి ఉండదు. కేవలం మీ ఐ పవర్‌ను టెస్ట్‌ చేస్తాయి. అయితే వీటిలో క్రియేట్ చేసిన ఫోటోలు మాత్రమే కాకుండా.. సహజంగా తీసిన ఫొటోల్లో దాగి ఉన్న ఆసక్తికర విషయాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ ఫోటోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా ఆప్టికల్ ఇల్యూజన్.? అందులో ఉన్న స్పెషాలిటీ ఏంటో.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది. స్టోర్‌ రూమ్‌లో ఉన్న పాత వస్తువులు సముదాయం ఉందని అనుకుంటున్నారు కదూ! అయితే ఈ ఫొటోలోనే ఓ పాము దాగి ఉంది. దానిని గుర్తు పట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ ముఖ్య ఉద్దేశం. పాత వైర్లు, వాడిన పెయింట్‌ బాక్స్‌ల్లోనే ఓ నల్లటి తాచు పాము కనిపిస్తోంది. ఈ పామును కేవలం 10 సెకండ్లలోనే గుర్తించడమే ఈ పజిల్ ముఖ్య ఉద్దేశం. మరి మీరు ఈ పామును కనిపెట్టగలరేమో ఓసారి ప్రయత్నించండి. ఎంత ప్రయత్నించినా ఆ పామును కనిపెట్టలేకపోతున్నారా.? అయితే ఓసారి పెయింట్ బాక్స్‌ల వెనకాల గమనించండి. ఒక నల్లటి పాము వాటి వెనకాలే తలదాచుకుంది. ఎంత ప్రయత్నించినా పాము కనిపించకపోతే సమాధానం కోసం కింద చూడండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..