ChatGPT: వార్నీ.. ఏఐని అవి కూడా అడుగుతున్నారుగా.. ఇకపై చాట్‌జీపీటీ ఆన్సర్లు చెప్పదు.. ఎందుకంటే..?

ఏఐతో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎంతో కష్టమైన పని కూడా ఈజీగా చేయవచ్చు. అయితే నష్టాలు కూాడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయారు. ఏఐ వచ్చినప్పటి నుంచి కొంతమంది ప్రతి చిన్న విషయానికి దానిపైనే ఆధారపడుతున్నారు. లవర్‌తో విడిపోవాల వద్ద అనే విషయాలను కూడా దాన్నే అడగడం గమనార్హం.

ChatGPT: వార్నీ.. ఏఐని అవి కూడా అడుగుతున్నారుగా.. ఇకపై చాట్‌జీపీటీ ఆన్సర్లు చెప్పదు.. ఎందుకంటే..?
ChatGPT to stop giving direct relationship advice

Updated on: Aug 06, 2025 | 6:34 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీంతో వర్క్ చాలా ఈజీగా మారింది. ఇదే సమయంలో ఏఐ వల్ల ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. రానున్న కాలంలో వేల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఏఐ వచ్చిన నుంచి ప్రతి చిన్న పనికి దానిపైనే ఆధారపడడం కామన్‌గా మారింది. ప్రతి చిన్న విషయం దాన్నే అడుగుతున్నారు. అంతేకాకుండా ఒంటరిగా ఉన్న వాళ్లు కృత్రిమ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్‌ లను సృష్టించుకుని ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. మరికొంత మంది లవర్‌తో విడిపోవాలా..? పార్ట్‌నర్‌కి బ్రేకప్ చెప్పాలా..? లేకపోతే కలిసి ఉండాలా అనే విషయాలను కూడా చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్‌ను అడగడం గమనార్హం.

ఈ క్రమంలో చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ కీలక ప్రకటన చేసింది. ఇకపై సంబంధాల గురించి డైరెక్ట్‌గా చాట్ జీపీటీ సమాధానాలు చెప్పదని తెలిపింది. బాయ్ ప్రెండ్‌తో విడిపోవాలా.? వద్దా..? అనే ప్రశ్నలకు ఎటువంటి ఆన్సర్ ఇవ్వదని స్పష్టం చేసింది. వ్యక్తిగత నిర్ణయాలకు కొత్త ప్రవర్తన నియమావళి త్వరలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. అవి పర్సనల్ క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వదని.. అయితే మిగితా అంశాలకు సహాయంగా ఉంటుందని తెలిపింది. అటువంటి విషయాల్లో యూజర్లు స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. ‘‘ ఏఐ పార్ట్‌నర్‌తో విడిపోవాలా అని అడిగినప్పుడు చాట్ జీపీటీ డైరెక్ట్ సమాధానం ఇవ్వకూడదు. అది మిమ్మల్ని ఆలోచించేందుకు సహాయం చేయాలి. ప్రశ్నలు అడిగి, లాభనష్టాలను పరిశీలించి మీకు సహాయం చేసేలా ఉండాలి’’ అని కంపెనీ తెలిపింది.

అందుకే వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా మార్పులు చేస్తున్నట్లు ఓపెన్ ఏఐ తెలిపింది. ఈ మార్పుకు మద్దతుగా.. ఓపెన్ ఏఐ మానవ-కంప్యూటర్ ఇంటరాక్షన్, యువజన అభివృద్ధి, మానసిక ఆరోగ్య నిపుణులతో కూడిన సలహా బృందాన్ని ఏర్పాటు చేయనుంది. సున్నితంగా, సంభాషణను కొనసాగించేలా యూజర్లను ప్రేరేపిస్తోందని వచ్చిన ఫిర్యాదుల తర్వాత వాటిని సరిదిద్దేందుకు పనిచేస్తున్నట్లు ఓపెన్ ఏఐ తెలిపింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..