Watch Video: ఇదేక్కడి వింతరా సామీ..! రైల్వే గేటు వద్ద రైలును ఆపి గేటు వేసుకుంటున్న లోకో పైలట్‌..!! వీడియో చూస్తే అవాక్కే..

|

Sep 04, 2023 | 8:43 AM

ఇక్కడ లోకోపైలట్‌ స్వయంగా రైలు దిగి గేటు వేసుకోవాల్సిందే.. అందుకోసం ఈ మార్గంలో వచ్చే రైలు గేటుకు సమీపంలోకి రాగానే రైలు ఆగుతుంది. అప్పుడు లోకో పైలట్ రైలులోంచి దిగి గేటు వేసుకుంటాడు..తిరిగి రైలు స్టార్ట్‌ చేసుకుని వెళ్తాడు.. రైలు గేటు దాటిన తర్వాత...రైలు లాస్ట్‌ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న మరో రైల్వే ఉద్యోగి కిందకు దిగి.. గేటు ఓపెన్‌ చేస్తాడు. ఇలాంటిది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అనుకుంటే పొరపడినట్టే..

Watch Video: ఇదేక్కడి వింతరా సామీ..! రైల్వే గేటు వద్ద రైలును ఆపి గేటు వేసుకుంటున్న లోకో పైలట్‌..!! వీడియో చూస్తే అవాక్కే..
Loco Pilot
Follow us on

విమానాన్ని నడిపే డ్రైవర్‌ని పైలట్‌ అంటే.. రైలును నడిపే డ్రైవర్‌ను లోకోపైలట్ అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ ఇద్దరి బాధ్యత చాలా పెద్దది. ఎందుకంటే..వందలు, వేల మంది ప్రయాణికుల ప్రాణాలు వీరి చేతుల్లోనే ఉంటాయనేది వాస్తవం. మన భారతీయ రైల్వేలో పనిచేసే లోకోపైలట్ ప్రజల్ని గమ్యస్థానాలకు చేర్చడం మాత్రమే కాదు, గూడ్స్ రైళ్లల్లో ఉత్పత్తులను కూడా తరలిస్తుంటారు. లోకోపైలట్‌ విధి నిర్వహణలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.. ఇంజిన్‌ను సరిగ్గా నిర్వహించడం, రైలులో ఏవైనా మరమ్మతులు ఉంటే గుర్తించడం, వాటిని బాగు చేయించడం, సిగ్నల్ మార్పులను పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు రైల్వే అధికారులతో మాట్లాడుతూ ఉండటం లోకో పైలట్ పని. లోకో పైలట్ తన విధిని తెలివిగా నిర్వహించడం చాలా ముఖ్యం. అయితే, సోషల్ మీడియాలో ఓ రైలు లోకోపైలట్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్‌ నెట్‌లో వైరల్‌గా మారింది. ఇందులో రైలును ఆపిన తర్వాత లోకో పైలట్ స్వయంగా వెళ్లి.. లేబుల్ క్రాసింగ్ గేటును కిందకు దించుతున్నాడు..రైలు గేటును దాటిన తర్వాత.. వెనుక కంపార్ట్‌మెంట్‌లో ఉన్న రైల్వే ఉద్యోగి ఇంకొకరు దిగి ఆపి గేటు తెరుస్తున్నాడు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన బీహార్‌కు చెందినది తెలిసింది.

బీహార్‌లోని సివాన్ రైల్వే గేటుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇండియన్‌ రైల్వేలో ప్రస్తుతం ఆధునికీకరణ పనులు భారీగా కొనసాగుతున్నాయి. అయితే సివాన్ జిల్లాలోని ఈ రైల్వే గేటు మాత్రం గత ఐదేళ్లుగా అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది.ఈ రైల్వే గేట్ సివాన్ జిల్లాలోని మహారాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగద్‌గంజ్‌లో ఉంది. ఈ మహారాజ్‌గంజ్-మషార్ఖ్ రహదారి అందుబాటులోకి వచ్చి ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఇక్కడ రైల్వే గేటు మెన్‌ని నియమించలేదు. దాంతో రైలు లోకోపైలట్‌ స్వయంగా రైలు దిగి గేటు వేసుకోవాల్సిందే.. అందుకోసం ఈ మార్గంలో వచ్చే రైలు గేటుకు సమీపంలోకి రాగానే రైలు ఆగుతుంది. అప్పుడు లోకో పైలట్ రైలులోంచి దిగి గేటు వేసుకుంటాడు..తిరిగి రైలు స్టార్ట్‌ చేసుకుని వెళ్తాడు.. రైలు గేటు దాటిన తర్వాత…రైలు లాస్ట్‌ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న మరో రైల్వే ఉద్యోగి కిందకు దిగి.. గేటు ఓపెన్‌ చేస్తాడు. ఇలాంటిది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అనుకుంటే పొరపడినట్టే.. ఎందుకంటే..ఈ రూట్లో ఇలాంటి సీన్‌ రోజుకు ఒకసారి కాదు నాలుగు సార్లు ఇదే జరుగుతుంది. . కానీ రైల్వేశాఖ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదని స్థానికులు, రైల్వే సిబ్బంది వాపోతున్నారు. ఇది ఎప్పటికైనా ప్రమాదమే అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గేట్‌మెన్‌ను నియమిస్తే రైల్వేకు నష్టం..

అయితే, సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ కావటంతో సంబంధిత అధికారులు స్పందించారు.ఈ మొత్తం విషయంపై వారణాసి రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ సింగ్ వివరణ ఇచ్చారు. మహారాజ్‌గంజ్ దరోండా-మషార్ఖ్ మధ్య ఒకేసారి ఒక రైలు మాత్రమే వెళ్తుందని చెప్పారు. ఆ తర్వాత అదే రైలు అక్కడి నుంచి తిరిగి వస్తుంది.. అంటే ఒకే రైలు నాలుగు ట్రిప్పులు వేస్తుంది. అందుకే రైల్వే రూల్ ప్రకారం రైల్వే గేట్ వద్ద గేట్‌మెన్‌ను నియమించలేదని చెప్పారు. ఎందుకంటే ఆ మార్గంలో ఖర్చు ఎక్కువ అంటున్నారు. దీనివల్ల రైల్వేకు నష్టమేనన్నారు.

ఇక, సోషల్ మీడియాలో వీడియో చూసిన జనాలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో indian.official.memes అనే పేజీ షేర్ చేసింది. ఇప్పటి వరకు మిలియన్ల మంది ప్రజలు వీడియోని వీక్షించారు. దీనిని చూసిన జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..