AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎన్ని హైనాలు వచ్చినా తగ్గేదేలే అంటోన్న మృగరాజు.. షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్

సింహాన్ని అన్ని వైపుల నుండి చాలా హైనాలు చుట్టుముట్టినట్లు మీరు వీడియోలో చూడవచ్చు. కొన్ని హైనాలు సింహాన్ని వెనుక నుండి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

Viral Video: ఎన్ని హైనాలు వచ్చినా తగ్గేదేలే అంటోన్న మృగరాజు.. షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Jul 05, 2022 | 10:55 AM

Share

Viral Video: సింహం, పులి, చిరుతపులి, చిరుత , హైనా, ఎలుగుబంటి  మొదలైన అనేక రకాల కౄర జంతువులు అడవిలో నివసిస్తాయి. వీటిల్లో అత్యంత ప్రమాదకరమైనవి, శక్తివంతమైన జంతువులు సింహాలుగా పరిగణించబడతాయి. సింహాలను అడవి రారాజు అని కూడా అంటారు. పులులకు కూడా సింహంతో పోటీపడే ధైర్యం లేదు. అయితే హైనాలు  వంటి జంతువులు గుంపులుగా జీవిస్తాయి. అంతేకాదు సింహాలతో కూడా పోటీపడే ధైర్యం హైనాల సొంతం. కొన్ని హైనాలు సింహాలను కూడా వేటాడే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. సింహాలు చాలా శక్తివంతమైనవి..కనుక హైనా సింహంతో పోరాడే సమయంలో అత్యంత శ్రమపడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సింహం, హైనాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో హైనాల మధ్య సింహం ఉంది. హైనాలు సింహాన్ని వేటాడాలనుకుంటున్నాయి.. అయితే  సింహం.. అడవి రాజు ఎందుకు హైనాకు లొంగుతుంది.. పోరాడుతుంది కానీ..

సింహాన్ని అన్ని వైపుల నుండి చాలా హైనాలు చుట్టుముట్టినట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఒకటి కాదు రెండు కాదు.. సుమారు 30 హైనా లు ఒక్క సింహం తో పోరాడడానికి రెడీ అయ్యాయి. అంతేకాదు.. అవి సింహాన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కొన్ని సార్లు సింహం నుంచి హైనా తప్పించుకుని పారిపోతుంది. మరికొన్ని హైనాలు సింహాన్ని వెనుక నుండి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే సింహం వాటివైపు తీక్షణంగా చూసిన వెంటనే.. అవి వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇలా హైనాలు సింహాన్న వెనుక నుంచి వేయడానికి ప్రయత్నిస్తున్నాయి.. కానీ తన దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్న హైనాలను గర్జనతోనే భయపెడుతుంది సింహం.. ఇలా కొంత సేపు జరిగిన అనంతరం.. సింహం అక్కడ దగ్గర్లో ఉన్న.. జంతు కళేబరాన్ని చూసింది.. హైనాలను పట్టించుకోకుండా.. మెల్లగా నడుచుకుంటూ.. తన ఆహారం దగ్గరకు వెళ్లి.. జాగ్రత్తగా అక్కడ కూర్చుని.. ఆహారాన్ని తినడం ప్రారంభించింది. అదే సమయంలో హైనాలు సింహాన్ని వెనుక నుండి చూస్తున్నాయి.. అంతేకాని సింహం దగ్గరకు వెళ్ళడానికి ధైర్యం చేయలేదు.

ఇవి కూడా చదవండి

బబ్బర్ సింహం , హైనాల మధ్య జరిగిన చోటు చేసుకున్న ఈ పోరాటం చాలా ఆశ్చర్యపరిచింది. ఇలాంటి భయానక దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ వీడియో కెన్యాలో చోటు చేసుకునంట్లు తెలుస్తోంది.

ఈ వీడియో రాబర్ట్ జాన్ అనే ఐడితో యూట్యూబ్‌లో షేర్ చేయబడింది, ఇది ఇప్పటివరకు 9 లక్షల వ్యూస్, వేలాది లైక్స్ ను సొంతం చేసుకున్నది.  సుమారు 30 హైనాల మధ్య.. ఒంటిరిగా పోరాడిన  సింహం ధైర్యంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్