
నేటి ప్రపంచంలో, చిన్న చిన్న కష్టాలు కూడా ప్రజలు తమ విధిని శపించేలా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ధైర్యం, ఆశ, కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఈ వీడియో ఒక కాలు లేని పిల్లవాడి గురించి, ఆత్మ విశ్వాసం గురించి తెలియజేస్తుంది. క్రికెట్ పట్ల అతని మక్కువ, ధైర్యం ఒక ప్రొఫెషనల్ ఆటగాడి కంటే తక్కువేం కాదు.. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠంలాంటిదే.. జీవితాన్ని ఎప్పుడూ వదులుకోవద్దని, జీవిత సవాళ్లతో నిరంతరం పోరాడాలని నేర్పుతుంది.
ఈ వైరల్ వీడియోలో, ఒక కాలు కోల్పోయిన పిల్లవాడు క్రికెట్ మైదానంలో పూర్తి విశ్వాసంతో.. ఉత్సాహంగా నిలబడి బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను నిలబడి ఉండటమే కాకుండా, ఫాస్ట్ బౌలర్‌ను ఎదుర్కొంటూ, శక్తివంతమైన షాట్ కొడుతూ, ఆపై, ఏ మాత్రం సమయం వృధా చేయకుండా, కర్ర సహాయంతో పరుగు కోసం పరిగెడుతాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ పిల్లవాడు పదే పదే షాట్లు కొడుతూ అదే శక్తితో పరిగెత్తుతున్నాడు. ఆ పిల్లవాడి అద్భుతమైన చురుకుదనం, క్రికెట్ పట్ల అంకితభావం చూసి, అతను శారీరకంగా వికలాంగుడని ఎవరూ చెప్పలేరు.
“మీరందరూ మీ విధిని శపించండి” అనే శీర్షికతో యూట్యూబ్ షార్ట్స్‌లో షేర్ చేసిన ఈ వీడియో లక్షలాది మందిని ఆకర్షించింది. ఆ బాలుడి ఉత్సాహభరితమైన స్ఫూర్తిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కామెంట్ల విభాగంలో తమ ప్రేమను కురిపిస్తున్నారు. “ఈ చిన్న క్రికెటర్ ఈరోజు నాకు గొప్ప జీవిత పాఠం నేర్పించాడు” అని ఒక యూజర్ వ్యాఖ్యానించాడు. మరొకరు, “తనను సమానంగా చూసుకుని పూర్తి వేగంతో బౌలింగ్ చేసి, సమాన దూకుడుతో ఫీల్డింగ్ చేసిన ప్రత్యర్థి జట్టుకు సెల్యూట్. ఇది నిజమైన క్రీడా స్ఫూర్తి” అని అన్నారు. మరొక యూజర్, “సోదరా, నేను ఏమి చెప్పగలను? నిన్ను ప్రశంసించడానికి మాటలు సరిపోవు. మీరు అద్భుతంగా ఉన్నారు.” అని వ్రాశాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..