Viral Photo: ఇదేం పెళ్లిరా బాబూ.. ‘ఒక్క వరుడు.. ఇద్దరు వధువులు’.. నెట్టింట ట్రెండింగ్!

|

Jun 10, 2022 | 12:06 PM

పెళ్లితంతు కాసేపట్లో అనగా.. పెళ్ళికూతురు జంప్ అని.. లేదా ఫోటోగ్రాఫర్ లేదని పెళ్లి క్యాన్సిల్ కావడం..

Viral Photo: ఇదేం పెళ్లిరా బాబూ.. ఒక్క వరుడు.. ఇద్దరు వధువులు.. నెట్టింట ట్రెండింగ్!
Marriage Banner
Follow us on

ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన ఎన్నో రకాల న్యూస్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పెళ్లితంతు కాసేపట్లో అనగా.. పెళ్ళికూతురు జంప్ అని.. లేదా ఫోటోగ్రాఫర్ లేదని పెళ్లి క్యాన్సిల్ కావడం.. లేదా ఇష్టం లేని పెళ్లి అని వరుడు/వధువు పారిపోవడం.. ఇలా చాలా మనం వినే ఉంటాం. అయితే తాజాగా నెట్టింట ఓ పెళ్లి బ్యానర్ వైరల్‌గా మారింది. అది ఎక్కడిదో.? నిజమో లేక ఫోటోషాప్ మాయో తెలియదు గానీ.. దీనిపై నెటిజన్లు విపరీతంగా కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

సాధారణంగా మనం పెళ్లి ఫ్లెక్సీపై వరుడు, వధువు పేర్లు.. వారివారి కుటుంబాల నేమ్స్ ఉంటాం. అయితే ఇక్కడ వైరల్ అవుతున్న బ్యానర్‌లో ఓ వరుడు.. ఇద్దరు వధువుల పేర్లు ఉన్నాయి. అక్కడ కూడా ఓ ట్విస్ట్ ఉంది. బ్యానర్‌లో ‘బాలాజీ వెడ్స్ రాజలక్ష్మీ లేదా పవిత్ర’ అని రాసి ఉంది. పెళ్లి తేదీ 06.03.2022 అని పేర్కొని ఉంది. అంటే ఆ వరుడు.. ఓ వధువు కాదంటే.. మరొకరిని పెళ్లి చేసుకుంటాడని చూస్తే మీకు ఇట్టే అర్ధమవుతుంది.

మరి ఆ వరుడు ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలియదు గానీ.. ఈ బ్యానర్ మాత్రం ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఇదెక్కడి పెళ్ళిరా నాయనా.. నేనేడా చూడలే’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘నారీ నారీ నడుమ మురారి లాగ’ ఉందని మరొకరు కామెంట్ పెట్టారు.