యాత్రికుడి కాళ్లకు ఎస్పీ మసాజ్..వైరల్ అవుతోన్న వీడియో!

|

Jul 28, 2019 | 12:18 PM

షామ్లీ: అతనో సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్‌. పేరు అజయ్ కుమార్. ఎస్పీ అంటే ఆ స్థాయి, హుందాతనం వేరు. కానీ వాటన్నీటిని దాటి  ఆయన చేసిన పని నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.  ఉత్తర్‌ ప్రదేశ్‌లో ప్రస్తుతం కన్వార్‌ యాత్ర జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం షామ్లీలో నేచురోపతి క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.  దీన్ని ప్రారంభించాల్సిందిగా అజయ్‌ కుమార్‌కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓ యాత్రికుడికి కాళ్లకు మసాజ్‌ […]

యాత్రికుడి కాళ్లకు ఎస్పీ మసాజ్..వైరల్ అవుతోన్న వీడియో!
Follow us on

షామ్లీ: అతనో సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్‌. పేరు అజయ్ కుమార్. ఎస్పీ అంటే ఆ స్థాయి, హుందాతనం వేరు. కానీ వాటన్నీటిని దాటి  ఆయన చేసిన పని నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.  ఉత్తర్‌ ప్రదేశ్‌లో ప్రస్తుతం కన్వార్‌ యాత్ర జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం షామ్లీలో నేచురోపతి క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.  దీన్ని ప్రారంభించాల్సిందిగా అజయ్‌ కుమార్‌కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓ యాత్రికుడికి కాళ్లకు మసాజ్‌ చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియో వైరల్‌ అవుతోంది. ఒక ఐపీఎస్ అధికారి..  పోలీస్ అంటే సర్వీస్ అనేలా ప్రవర్తించిన తీరుపై  డిపార్ట్‌మెంట్  ఉన్నతాధికారులు కూడా అభినందనలు తెలుపుతున్నారు.