మీరు స్కిప్పింగ్ చేయగలరా ? అదేనండి .. తాడు ఆట. వయసు పెరిగే కొద్ది శారీరకంగా.. మానసికంగా ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి కావాల్సినంత శ్రమ కల్పించాలంటారు. నడవడం, పరిగెత్తడం, జంపింగ్ చేయడం వంటివి చేస్తే శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఉత్సాహంగా ఉంటారు.. ఇందులో ముఖ్యంగా రోజూ స్కిప్పింగ్ చేయడం వలన ఫిట్‌గా ఉండడమే కాదు.. ఆరోగ్యంగా.. ఉత్సాహంగానూ ఉంటారు.. కానీ ఈ ఆధునిక కాలంలో చాలా మంది స్కిప్పింగ్ చేయడమంటే అమడ దూరంలో ఉంటారు.. ప్రస్తుతం కాస్త వయసు పెరిగిన వారు ఎక్కువ దూరం నడిచినవారు అలసిపోతుంటారు. ఉత్సాహంగా నడవలేకపోవడం.. పరిగెత్తలేకపోవడం.. జంపింగ్ చేయడం అంటే 40 ఏళ్లు దాటిన వారికి కత్తి మీద సాములా ఉంటుంది.. కొద్ది దూరం నడిస్తే చాలు అలసిపోయి పడిపోతుంటారు. కానీ ఓ 80 ఏళ్లకు పైగా వయసున్న ఓ బామ్మ మాత్రం ఎంతో ఉత్సాహంగా స్కిప్పింగ్ ఆడేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తుంది..
అందులో ఓ బామ్మ.. తన ఇంటి ప్రాంగణంలో చేతిలో తాడు పట్టుకుని నవ్వుతూ నిలబడింది. ఆ తర్వాత ఆ బామ్మ.. తాను చిన్నప్పుడు ఎంతో ఎనర్జీగా.. సంతోషంగా ఆడిన ఆటను.. 80 ఏళ్ల వయసులోనూ ఆడింది. మొదట్లో సరిగ్గా జంప్ చేయలేకపోయినప్పుటికీ పట్టు విడవకుండా ఆడింది.. ఆ వయసులోనూ తనపై తనకు నమ్మకంతో.. అమాయకత్వం.. చురుకుదనం.. పట్టు వదలకుండా స్కిప్పింగ్ ఆడిన తీరును చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను hepgul5 అనే ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా.. వీడియో తెగ వైరల్ అవుతుంది. బామ్మ ఎనర్జీ చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బామ్మ స్కిప్పింగ్ వీడియోను మీరు చూసేయ్యండి..