NRI Couple Skiing :భారతీయ సంప్రాయమైన చీర, ధోతి లో ఎన్ఆర్ఐ జంట స్కీయింగ్‌. వైరల్ అవుతున్న వీడియో

|

Feb 09, 2021 | 5:21 PM

మంచు మీద నడవడం కష్టం.. ఇక స్కీయింగ్‌ చేయాలనుకుంటే.. అందుకు తగిన డ్రెస్ వేసుకోవాలి.. అప్పుడే సేఫ్ గా స్కీయింగ్‌ చేయగలరు ఎవరైనా.. అయితే అందరిలా మంచు పై స్కీయింగ్‌ చేస్తే ఏముంటుంది స్పెషల్ అనుకున్నారు ఓ ఎన్నారై జంట. అందుకే డిఫరెంట్ గా...

NRI Couple Skiing :భారతీయ సంప్రాయమైన చీర, ధోతి లో ఎన్ఆర్ఐ జంట స్కీయింగ్‌. వైరల్ అవుతున్న వీడియో
Follow us on

NRI Couple Skiing : మంచు మీద నడవడం కష్టం.. ఇక స్కీయింగ్‌ చేయాలనుకుంటే.. అందుకు తగిన డ్రెస్ వేసుకోవాలి.. అప్పుడే సేఫ్ గా స్కీయింగ్‌ చేయగలరు ఎవరైనా.. అయితే అందరిలా మంచు పై స్కీయింగ్‌ చేస్తే ఏముంటుంది స్పెషల్ అనుకున్నారు ఓ ఎన్నారై జంట. అందుకే డిఫరెంట్ గా ఆలోచించారు.. ఓ వైపు స్పెషల్ గా కనిపిస్తుంది.. మరోవైపు మన భారతీయ సంప్రాయాన్ని మేము ఎక్కడవున్నా మరచిపోలేదు అని తెలియసినట్లు ఉంటుంది అని భావించినట్లు ఉన్నారు.. దీంతో ఆ జంట చీర దోతీ కట్టారు.. మంచుపై స్కీయింగ్‌ ను సక్సెస్ ఫుల్ గా చేశారు. వివరాల్లోకి వెళ్తే..

దివ్య మైయా, మధు అనే ఓ ఎన్​ఆర్​ఐ జంట భారతీయ సాంప్రదాయ దుస్తులైన చీర, ధోతీ కట్టుకుని స్కీయింగ్‌ చేశారు.దివ్య ఆకాశాన్ని గుర్తు చేసేలా నీలిరంగు చీర, మధు ఏమో మంచు ని తలపించేలా తెల్లని ధోతి, నీలిరంగు చొక్కాను ధరించారు. ఇలా సాంప్రదాయ దుస్తుల్ని ధరించి స్కీయిగ్‌ చేసిన వీడియోను మైయా సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర్‌ల్‌ అయ్యింది.


అమెరికాలో నివసిస్తున్న ఈ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో మంచుపై సంతోషంగా విహరించడం చూపరులకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. దీంతో నెటిజన్లు లైక్​ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు ఈ జంటను ఉద్దేశించి ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అంటూ వ్యాఖ్యానించారు. కొందరేమో.. ఇలా సాంప్రదాయ దుస్తుల్ని ధరించి ఓసారి స్కీయింగ్‌ చేయడం ప్రయత్నించాలని తమ కోరికను వ్యక్త పరిచారు. ముఖ్యంగా భారతీయ వస్త్రధారణలో స్కీయింగ్ పరికరాలు ధరించడం అందరినీ ఆకర్షించింది.

కాగా, ఈ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసిన దివ్య.. “మేం స్పెషల్​గా ఏదో ఒకటి చేయాలనుకున్నాం.. శారీ అడ్వెంచర్​” అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే వైరల్​గా మారింది. వారిని అభినందిస్తూ ఎంతో మంది కామెంట్లు చేశారు. దీంతో ఈ దంపతులు ఫేమస్ అయ్యారు.

Also Read:

 తెలంగాణ పదవతరగతి పరీక్ష షెడ్యూల్‌ను రిలీజ్ చేసిన విద్యాశాఖ.. విద్యార్థులకు గుడ్ న్యూస్

ఉత్తరాఖండ్ ఘటనలో నిరంతర సేవలను అందిస్తున్న రెస్క్యూ టీమ్ కు సంఘీభావం తెలుపుతున్న సినీ ప్రముఖులు