ఆ దేశంలో విదేశీ షోలు చూసినా, షేర్ చేసినా మరణ శిక్షే.. ఆధునిక నియంత సరికొత్త ఆర్డర్.

పిచ్చి తుగ్లక్, హిటర్ల పాలనా విధానం, నిర్ణయాలను గురించి మనం పుస్తకాల్లో చదువుకుంటున్నాం.. అయితే వారి పాలనను పలు నిర్ణయాలతో మన కనుల ముందుకు తీసుకొస్తూ ఉంటాడు.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్. తాజాగా ఈ నియంత మరొక షాకింగ్ నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచాడు. ఎవరైనా దేశంలో విదేశీ టీవీ షోలు చూస్తే వారికి మరణశిక్ష విధించబడుతుందని షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది.

ఆ దేశంలో విదేశీ షోలు చూసినా, షేర్ చేసినా మరణ శిక్షే.. ఆధునిక నియంత సరికొత్త ఆర్డర్.
North Korea

Updated on: Sep 15, 2025 | 1:37 PM

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడూ వింత వింత నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. గతంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. అందుకనే కిమ్ కనిపించినా వార్తే.. కనిపించకుండా పోయినా వార్తే.. చివరికి తుమ్మినా, దగ్గినా కూడా వార్తే అన్న చందంగా ఆసక్తిని చూపిస్తూ ఉంటాయి ఇతర దేశాలు. ఈ నేపధ్యంలో కిమ్ జోంగ్ ఉన్ కొత్త నిర్ణయంతో వార్తల్లో నిలిచాడు. ఉత్తర కొరియా నియంత తీసుకున్న ఒక నిర్ణయం యావత్ ప్రజానీకానికి షాకింగ్ వార్తగా నిలిచింది. తన దేశ ప్రజల అణిచివేత కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అనేక అణచివేత నియమాలను రూపొందించారు. ఈ నియమాలలో ఒకదాని ప్రకారం విదేశీ టీవీ షో చూడటం మరణశిక్ష విధించదగినదని కిమ్ భావిస్తున్నట్లు సంచలనాత్మక సమాచారం వెలుగులోకి వచ్చింది.

విదేశీ టీవీ షో చూడటం ప్రత్యక్ష మరణశిక్ష.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నివేదిక వెలువడింది. ఈ నివేదిక ప్రకారం ఉత్తర కొరియాలో విదేశీ టీవీ షోలు చూడటం మరణశిక్ష విధించదగినదని చెప్పబడింది. ముఖ్యంగా దక్షిణ కొరియా టీవీ షోలు ఉత్తర కొరియాలో నిషేధించబడ్డాయి. అందువల్ల ఈ దేశంలో ఏదైనా టీవీ షో చూడటం నేరం గా పరిగణించి.. మరణశిక్ష విధించదగినదిగా భావిస్తున్నారు. విదేశీ షోను షేర్ చేయడం కూడా మరణశిక్ష విధించదగినది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఉత్తర కొరియాలో పరిస్థితి 2014 నుంచి రోజు రోజుకీ మరింత దిగజారుతోంది. కరోనా మహమ్మారి తర్వాత మరణశిక్ష విధించబడిన వారి సంఖ్య పెరిగిందని కూడా వెలుగులోకి వచ్చింది.

ప్రజలపై నిఘా పెరిగింది.
ఈ ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం గత పదేళ్లలో ఉత్తర కొరియాలో పరిస్థితి మరింత దిగజారింది. ఇక్కడ మానవ హక్కులు మెరుగుపడలేదు. కిమ్ జోంగ్ ఉన్ ప్రజలపై నియంత్రణ కొనసాగిస్తున్నారు. తన దేశ ప్రజలపై నిఘా పెరిగింది. పౌరుల ప్రతి కదలికను అక్కడ పర్యవేక్షిస్తారు. అక్కడి పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి అనుమతి లేదు.

ఇవి కూడా చదవండి

ప్రజల మనోభావాలను అణచివేయడానికి…
ఉత్తర కొరియా నుంచి పారిపోయిన ఒక వ్యక్తి .. తమ దేశంలో పాలన పద్దతి గురించి అనేక విషయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలు కళ్ళు, చెవులు మూసుకుని ఉండేలా నియమాలను కఠినతరం చేశారు. ఏవైనా ఫిర్యాదులు లేదా తిరుగుబాటు కలిగితే ఎక్కడికక్కడే అణచివేసి.. తిరుబాటు తీవ్ర రూపం దాల్చకుండా చూసుకోవడానికి నిఘా పెడుతున్నట్లు ఫిరాయింపుదారుడు చెప్పాడు. ఈ ఆంక్షలన్నీ ఉత్తర కొరియా ప్రజల జీవితాన్ని కష్టతరం చేశాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ఉత్తర కొరియాను అంధకార దేశంగా పేర్కొంది.

 

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..