జుట్టు రాలిపోతోందని, ఏకంగా తలస్నానమే చేయడం మానేసాడో వ్యక్తి. ఏదో నెలా, రెండు నెలలో కాదు… ఏకంగా ఆరేళ్లుగా అతను హెడ్‌బాత్ చేయడం మానేసాడు. ప్రస్తుత కాలంలో యువతను ఎక్కువగా వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. పోషకాహారలోపం, జంక్‌ఫుడ్, కెమికల్ షాంపూలు వాడకం ఇలా రకరకాల కారణాలతో చాలామందికి చిన్న వయస్సులోనే జుట్టు ఊడిపోతుంది. ఇదే సమస్య నిక్ కోయెట్టీకి వచ్చింది. అతడికి చిన్నవయస్సులోనే జుట్టంతా రాలడం ప్రారంభమైంది. స్కూల్ ఫస్ట్ పీరియడ్ అయిపోగానే, అతడి షర్ట్‌పై మొత్తం తల వెంట్రుకలే ఉండేవి. దీంతో అతడు ప్రతిరోజూ స్కూల్‌కు రెండు, మూడు షర్ట్‌లు వెంట తీసుకెళ్లేవాడు. మధ్య మధ్యలో షర్ట్ చేంజ్ చేసుకునేవాడు.
అయితే తాను వాడే షాంపూలు, కండిషనర్లే తన జుట్టు రాలిపోవడానికి కారణమని గ్రహించాడు నిక్. అంతే ఇకపై తలస్నానమే చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఏకంగా ఆరేళ్లు తలస్నానమే చేయలేదు. ఇప్పుడు జుట్టు ఊడడమంటే ఏంటో కూడా తనకు తెలియదంటున్నాడు నిక్. తలస్నానం చేయకపోతే ఓ రెండు వారాలపాటు మురికిగా అనిపిస్తుందని, ఆ తర్వాత తలలో సహజనూనెలు ఉత్పత్తి అవుతాయని, వాటికవే ఫ్రెష్‌గా మారిపోతాయని చెబుతున్నాడు. మనం తలస్నానం చేయాల్సిన అవసరమే లేదంటున్నాడు.