Viral: బైక్‌పై గ్యాస్ సిలిండర్.. తేడాగా వాలకం.. ఆపి చెక్ చేయగా పోలీసులు స్టన్.. లోపల

|

Sep 18, 2022 | 4:25 PM

మెయిన్‌పురిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. ఈ రాకెట్‌కు సహకరించిన ఇతర వ్యక్తుల గురించి విచారణ ప్రారంభించారు.

Viral: బైక్‌పై గ్యాస్ సిలిండర్.. తేడాగా వాలకం.. ఆపి చెక్ చేయగా పోలీసులు స్టన్.. లోపల
Ganja Smuggling(representative image)
Follow us on

Ganja: గంజాయి అక్రమంగా స్మగ్లింగ్‌ చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లోని డ్రగ్స్ పెడ్లర్స్ కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఎల్‌పీజీ సిలిండర్‌లో గంజాయిని దాచి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన స్మగ్లర్లలో ఒకరు ఆగ్రా నివాసి కాగా, మరొకరు ఫరూఖాబాద్‌కు చెందినవారు. ఆదివారం ఉదయం ఇద్దరు యువకులు ఎల్‌పీజీ సిలిండర్లతో బైక్‌పై మెయిన్‌పురి(mainpuri) పరిధిలోని బిచ్వాన్ ప్రాంతం గుండా వెళ్తున్నారు. అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా యువకులిద్దరూ.. ఖాకీలను తప్పుదోవ పట్టించారు. వారి మాటలు తేడాగా ఉండటంతో… పోలీసులు గ్యాస్ సిలిండర్‌ను పరిశీలించగా.. దాని బరువు సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఇద్దరు యువకులను గట్టిగా విచారించగా, సిలిండర్‌లో గంజాయి నింపినట్లు అంగీకరించారు. నిందితులను లఖన్, శివమ్‌లుగా  గుర్తించారు.  పట్టుబడిన స్మగ్లర్ల వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి వద్ద నుంచి మరింత గంజాయిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. వీరు గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..