అప్పుడప్పుడూ సముద్ర తీరానికి వింత వస్తువులు, అరుదైన అవశేషాలు కొట్టుకొస్తుంటాయి. వాటిని పురావస్తు అధికారులు పరిశీలించి.. పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుంటుంటారు. ఈ కోవలోనే తాజాగా బ్రిటన్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌లోని బ్రిడ్లింగ్‌టన్ బీచ్‌లో ఓ వ్యక్తి అరుదైన పుర్రె లభించింది. అది అచ్చం డ్రాగన్ పుర్రెను పోలి ఉండటంతో.. సదరు వ్యక్తి అందుకు సంబంధించిన ఫోటోలను రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. అవి కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యాయి. “బ్రిడ్లింగ్‌టన్ బీచ్‌లో సేద తీరుతున్నప్పుడు.. అక్కడున్న ఇసుకలో ఒక రకమైన జంతువుల పుర్రె దొరికింది! సరిగ్గా పరిశీలిస్తే.. ‘గేమ్ ఆఫ్ ధ్రోన్స్’లోని డ్రాగన్ పుర్రెలా అనిపించింది’ అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టాడు. పుర్రె పైభాగంలో రెండు కోణాల కళ్లు, దిగువన ముక్కు ఉంది. కొందరు పుర్రె డ్రాగన్‌కు చెందినదని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు అది “వైవర్న్”(Wyvern)కి చెందినదని రాసుకొచ్చారు. కాగా, మరో నెటిజన్.. ఇలాంటి అరుదైన వస్తువును 2013లో కనుగొన్నానని కామెంట్ చేసింది.