Viral Video: మంచి పనికి మతంతో సంబంధం లేదు.. వైరల్‎గా మారిన వీడియో..

|

Nov 30, 2021 | 5:22 PM

ఒక వ్యక్తికి మరొక వ్యక్తి పరిచయం అవ్వగానే మొదట అడిగే ప్రశ్న నీ పేరు ఏంటి.. మీది ఏ ఊరు.. ఆ తర్వాత మీది ఏ కులం లేదా ఏ మతం అని అడుగుతారు. కానీ మనిషికి ఉండాల్సింది మతం, కులం కాదు మంచి మనస్సు. ఈ మంచి మనస్సుతోనే ఓ వ్యక్తి...

Viral Video: మంచి పనికి మతంతో సంబంధం లేదు.. వైరల్‎గా మారిన వీడియో..
Viral Video
Follow us on

ఒక వ్యక్తికి మరొక వ్యక్తి పరిచయం అవ్వగానే మొదట అడిగే ప్రశ్న నీ పేరు ఏంటి.. మీది ఏ ఊరు.. ఆ తర్వాత మీది ఏ కులం లేదా ఏ మతం అని అడుగుతారు. కానీ మనిషికి ఉండాల్సింది మతం, కులం కాదు మంచి మనస్సు. ఈ మంచి మనస్సుతోనే ఓ వ్యక్తి.. బురదలో ఉన్న ఆవును రక్షించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. అయితే ఆ ఆవును రక్షించిన వ్యక్తి.. ఒక ముస్లిం.. అయితేనేం మంచి మనస్సుతో గొప్ప పని చేశారు. సాయం చేయడానికి మతంతో పని లేదని నిరూపించాడని నెటిజన్లు చెబుతున్నారు.

ఓ ఆవు గుంతలో పడింది. గుంతలోంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ దానికి సాధ్యం కావడం లేదు. ఇది గమనించిన ఓ ముస్లిం యువకుడు ఆవును రక్షించేందుకు గుంతలోకి దిగారు. ఆవు బయటకు వచ్చేలా సాయం చేశారు. ఈ వీడియోను బ్రజేష్ రాజ్ పుత్ అనే వ్యక్తి ట్విట్టర్‎లో పోస్టు చేశారు. దీంతో వీడియోకు 1.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.చాలా మంది ఈ వీడియోపై కామెంట్ చేస్తున్నారు. మంచి పనికి మతం పని లేదని… నీది గొప్ప మనస్సు మిత్రమా అని కామెంట్ చేస్తున్నారు.

Read Also.. Sirivennela Sitarama sastri: అత్యంత విషమంగా సిరివెన్నెల ఆరోగ్యం.. ఐసీయూలో చికిత్స..