
జమ్మూకశ్మీర్‌కు చెందిన ముమిన్ దార్ (23) పవర్ లిఫ్టింగ్, డెడ్‌లిఫ్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో కొత్త రికార్డు సృష్టించాడు. 663.5 కిలోల బరువులను ఎత్తి అతడు ఈ ఘనత సాధించాడు. ఈ అద్భుత సాధనంతో ముమిన్ జమ్మూ కశ్మీర్‌లో “స్ట్రాంగెస్ట్ మ్యాన్”గా గుర్తింపు పొందాడు. సీనియర్, జూనియర్ విభాగాల్లో పోటీ చేసి ముమిన్ రికార్డు సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేశాడు.
ఈ సందర్భంగా ముమిన్ దార్ మాట్లాడుతూ..జమ్మూ- కాశ్మీర్ స్ట్రాంగ్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నందుకు తనకే కాదు తన ప్రాంతానికి మొత్తం చీనాబ్ లోయకు గర్వకారణంగా ఉందన్నారు. ఈ బిరుదు సంవత్సరాల కృషి, త్యాగాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ తన విజయాన్ని తన ప్రాంత యువతకు అంకితం చేస్తున్నానని చెప్పారు. ప్రోత్సాహం, అవకాశం వచ్చినప్పుడు తన విజయం చీనాబ్ యువత సామర్థ్యాన్ని నిరూపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
పవర్‌లిఫ్టింగ్ ఇండియా, ఇంటర్నేషనల్ పవర్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (IPF) ఆధ్వర్యంలో ఆల్ J&K UT పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్, ఈ ప్రాంతంలో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..