Viral: అర్థరాత్రి కదులుతున్న బెడ్, వింత శబ్ధాలు కూడా.. ఏంటా అని చెక్ చేయగా గుండె గుభేల్

|

Jul 27, 2022 | 4:06 PM

ముంబైలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ టీనేజ్ అమ్మాయి ఓ షాకింగ్ అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ ఘటన గురించి చదివితే మీరు కూడా గగుర్పాటుకు గురవుతారు.

Viral: అర్థరాత్రి కదులుతున్న బెడ్, వింత శబ్ధాలు కూడా.. ఏంటా అని చెక్ చేయగా గుండె గుభేల్
Representative image
Follow us on

Trending: ప్రజంట్ రైనీ సీజన్ నడుస్తుంది. హెల్త్ విషయంతో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు పాములు విషయంలో కూడా కాస్త అలెర్ట్‌గా ఉండాలి. ఎందుకుంటే అవి పదే, పదే జనావాసాల్లోకి వస్తాయి. ఆదమరిస్తే.. అనుకోని ప్రమాదంలో పడేస్తాయి. తాజాగా ముంబై(Mumbai)లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ములుంద్‌(Mulund)కు చెందిన ఒక కుటుంబం గాఢ నిద్రలో ఉన్న సమయంలో వారు నిద్రిస్తున్న పరుపు కింద నుంచి వింత శబ్ధాలు వచ్చాయి. అంతేకాదు బెడ్ అడుగున ఏదో కదులుతున్నట్లు అనిపించింది. నిద్రలో ఉన్నారు కాబట్టి వారు పెద్దగా పట్టించుకోలేదు. కాస్త అసౌకర్యంగా అనిపించడంతో.. ఆ బెడ్‌పై నిద్రిస్తున్న 16 ఏళ్ల టీనేజర్ మేల్కొని అరవడం మొదలెట్టింది. తల్లిదండ్రులు నిద్రలో కలవరిస్తుందని భావించి పట్టించుకోలేదు.  దీంతో ఆ టీనేజర్ తల్లిని లేపింది. దీంతో అందరూ అలెర్టయి.. బెడ్‌షీట్‌లను దులిపారు. అప్పుడు కనిపించిన దృశ్యం చూసి వారంతా కంగుతిన్నారు. బెడ్ షీట్ల కింద ఓ కొండచిలువ కనిపించింది. దీంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇరుగుపొరుగు వారు కూడా జమ కూడి స్నేక్ రెస్క్యూ టీమ్‌కి ఫోన్ చేశారు. వారు అక్కడికి చేరుకునేలోగా పాము బెడ్ రూమ్ నుంచి కిచెన్‌లోకి చేరుకుంది. అనంతరం స్నేక్ క్యాచర్స్ జాగ్రత్తగా 3 అడుగుల పొడవున్న కొండచిలువను బంధించి.. తీసుకువెళ్లి అడవిలో వదిలేశారు. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న ములుండ్‌కు పాములు తరచుగా వస్తుంటాయి. దీంతో ఆ పార్క్ సమీప ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. సో.. బీ అలెర్ట్.. ఈ సీజన్‌లో పాములు తెగ కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండకపోతే.. ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..