Viral Video: ప్రాణం కోసం పాము పడగ మీద కూర్చున్న ఎలుక.. ఆహారాన్ని అందుకోవాలని పాము పాట్లు.. వీడియో వైరల్

మనుషులకే కాదు సృష్టిలో ఏ జీవికి అయినా మరణం అంటే భయమే.. మరణం సమీపంలో ఉంటే దానిని తప్పించుకోవడానికి నానాపాట్లు పడతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఎలుక పాము తలపై కూర్చుంది. అదే సమయంలో ఎలుకని తినేందుకు పాము ట్రై చేస్తుంది.

Viral Video: ప్రాణం కోసం పాము పడగ మీద కూర్చున్న ఎలుక.. ఆహారాన్ని అందుకోవాలని పాము పాట్లు.. వీడియో వైరల్
Viral Video

Updated on: Jul 16, 2025 | 11:22 AM

ఎలుకలు చాలా తెలివైన జంతువులు. పాములు, పిల్లులకు ప్రధాన ఆహరం ఎలుకలే. వీటికి తాము ఆహారం కాకుండా ఉండేందుకు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వివిధ వ్యూహాలను ఉపయోగిస్తాయి. ఎలుకలలోని ఈ తెలివితేటలను ఎవరైనా సరే మెచ్చుకోవాల్సిందే. వైరల్ అయిన ఒక వీడియో ఎలుక తెలివితేటలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఎలుక తన ప్రాణాలను కాపాడుకోవడానికి పాము తలపై కూర్చుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాముకి ఆహారం కాకుండా ఎలుక తన ప్రాణాలను కాపాడుకున్న విధానం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎప్పుడైనా సరే ఎలుక పాముకి కనిపిస్తే ఆ క్షణమే పాముకి చివరి క్షణం. పాముకి ఆహారం కావాల్సిందే. అయితే ఎలుక తన ప్రాణాలను కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది.

ఈ వీడియోలో ఒక ఎలుక నాగుపాము తలపై కూర్చుని ఉంది. అయితే ఆ పాము ఎలుక కోసం ప్రతిచోటా వెతుకుతోంది. ఎలుకను కనుగొనలేకపోయింది. పాము పడగపై కూర్చున్న ఎలుక.. పాము ఏ విధంగా కదిలితే ఆ విధంగా కదులుతూ తనని తాను రక్షించుకుంది. ఇంకా చెప్పాలంటే పాము పడగపై కూర్చున్న ఎలుక పాముతో ఆడుకుంది. ఈ పాము-ఎలుక ఆటతో విసిగిపోయినది పాము మాత్రమే.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

ఈ వీడియో X లో వైరల్ గా మారింది. ఈ వీడియోను శిఖర్ బరన్వాల్ షేర్ చేశారు. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు రకరకాల వ్యాఖ్యానించారు. ఎలుక తెలివితేటలను ప్రశంసిస్తున్నారు. ఒకరు ఎంత అద్భుతమైన తెలివి సోదరా అని కామెంట్ చేశారు. మరొకరు ఊపిరి మిగిలి ఉన్నంత వరకు ఆశ కూడా బ్రతికే ఉంటుందని అన్నారు. మరణం కాళ్ళ కింద ఉన్నా.. ఆయుస్సు ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని ఒక యూజర్ అన్నారు.

 

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..